సందేహాలు - సమాధానాలు
ప్రశ్న:
ఇపుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటీ??
జవాబు:
జీఓ.112 తేదీ:18.8.2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకం లకి ఇంటర్మీడియట్ కనీస అర్హత.2015 లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. దీన్ని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గా మార్పు చేసింది. ఐతే ఇలా నియామకం పొందిన వారు 5 ఇయర్స్ లోగా డిగ్రీ అర్హత సంపాదించాలి.
ప్రశ్న:
ఆన్ డ్యూటీ తర్వాత రోజు CL పెట్టవచ్చా??
జవాబు:
కొన్ని సందర్భంలలో OD పై వెళ్ళినప్పుడు TA చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు CL పెడితే TA చెల్లించరు.TA వద్దనుకుంటే CL పెట్టుకోవచ్చు.
ప్రశ్న:
ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి??
జవాబు:
బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి.45 ఇయర్స్ వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి,50 ఇయర్స్ వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.
ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??
జవాబు:
వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.
ప్రశ్న:
*సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??*
జవాబు:
ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.
0 comments:
Post a Comment