చేతులు కడుక్కోమన్నందుకు చంపేశారు
(నేడు ప్రపంచ చేతులు పరిశుభ్రతా దినోత్సవం)
కరోనా నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే చేతులు కడుక్కోవడానికి చాలా ప్రాముఖ్యత పెరిగింది.చేతులు కడుక్కోవడం అనేది ఇప్పుడు కోవిడ్ 19 నిబంధనలలో ఇది ఒకటిగా మారింది.
150 ఏళ్ల క్రితం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం పై ఎవరికి అవగాహన లేదు. హంగేరీకి చెందిన వైద్యుడు ఇగ్నాజ్ ఫిలిప్ సెమిల్వీస్ తాను పనిచేసే ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువులు ఎక్కువగా మరణించడం గమనించాడు.
ఆసుపత్రిలో సరైన వెలుతురు లేకపోవడం,రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల ఇటువంటి మరణాలు సంభవించి ఉండవచ్చని మిగతా వైద్యులు తెలిపారు. ఈ వివరణతో ఆయన సంతృప్తి చెందలేదు.ఇగ్నాజ్ మరింత లోతుగా అధ్యయనం చేశారు. వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది చేతులు కడుక్కోకుండా అనేకమంది రోగులకు సేవలు అందించడం వల్ల ఎదో ఒక క్రిమివల్ల చైల్డ్ బెడ్ ఫీవర్ వ్యాపించి శిశువులు మరణిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు.ఇందుకు ఆయన పలు ఆధారాలు సేకరించారు.తన సహచరులని చేతులు శుభ్రంగా కడుక్కోమని సూచించారు.తర్వాత ఈ జ్వరం గురించి మరికొంత పరిశోధన చేసి చేతుల పరిశుభ్రత ఆవశ్యకత పై ఒక పుస్తకాన్ని వెలువరించారు. తన పరిశోధనా పత్రాలని పలు వైద్య సంస్థలకి పంపారు.పలు వైద్యులకి ఈ విషయం గురించి చెప్పారు.వారంతా ఆయనను చూసి నవ్వారు.హేళన చేశారు.
దీనితో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైయారు.కొందరు ఆయనపై దాడి చేశారు. చివరకు తీవ్ర మతిమరుపుతో.మానసిక ఒత్తిడితో చనిపోయారు.1818 జులై 1న జన్మించిన ఇగ్నాజ్ 1865 ఆగస్ట్ 13న తుదిశ్వాస విడిచారు. తర్వాత కాలంలో ఆయన పరిశోధనలు నిజమని ప్రపంచం గుర్తించింది.అప్పటికి బ్యాక్టీరియా, వైరస్ ల గురించి ప్రపంచానికి అంతగా అవగాహన లేదు.ఇప్పుడు అక్టోబర్ 15 చేతులు కడుక్కోవాడానికి,దాని ఆవశ్యకతను వివరించడానికి
ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైన్స్ నమ్మకాలపై ఆధారపడదు.
9492712836
0 comments:
Post a Comment