★ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ, విల్లింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లోకి విలీనం చేసే ప్రక్రియలో మున్సిపల్ పాఠశాలల్లో కూడా వారిని విలీనం చేసుకోవడానికి మున్సిపల్ పరిపాలన శాఖ సమ్మతి తెలియజేసింది.
ఇందుకు కొన్ని షరతులను తెలియజేసింది:
★ ఎయిడెడ్ లో వారు ఇప్పటి వరకు చేసిన పాత సర్వీస్ కు ఎలాంటి వెయిటేజీ ఉండదు.
★ ప్రస్తుతం మున్సిపల్ పాఠశాలల్లో ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఖాళీలలో మాత్రమే వీరిని విలీనం చేస్తారు.
★ డీఎస్సీ 2018 కి సంబంధించిన బ్యాక్ లాగ్ ఖాళీలను మినహాయిస్తారు.
★ సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ లకు కేటగిరీల వారు, తత్సమానులను మాత్రమే విలీనానికి అనుమతిస్తారు.
★ ఒక పురపాలక సంఘం లోని కేడర్ స్ట్రేంత్ కన్నా ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎక్కువగా వుంటే, విద్యాహక్కు చట్టం మేరకు పోస్టులు అవసరమైన పక్షంలో సూపర్ న్యూమరీ పోస్టులు గా సర్దుబాటు చేసుకోవచ్చు.
★ ప్రస్తుతం మున్సిపల్ ఉపాధ్యాయులకు వర్తిస్తున్న అన్ని సౌలభ్యాలు (010 salaries, Medical Reimbursement, APGLI etc..stuap) విలీన ఉపాధ్యాయులకు వర్తిస్తాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వున్న మున్సిపల్ స్కూల్స్ లో చూపిన ఖాళీలు ముఖ్యమైనవి:
అన్ని కేటగిరీల
★ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు: 231
★ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు: 885
★ తెలుగు పండిత పోస్టులు: 30
★ హిందీ పండిత పోస్టులు : 17
(School Education Dept Memo.No299 St 13.10.2021)
0 comments:
Post a Comment