నవంబర్ 8 నాటికి పిల్లలకూ బయోమెట్రిక్ అఫ్లికేషన్ సిధ్ధం
ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు అడ్వైజర్ ( ఇన్ఫ్రా- స్కూల్ ఎడ్యుకేషన్) గారు DEO, APC, EE లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలు
1. ) వచ్చే జనవరిలో విద్యార్థులకు ఇవ్వవలసిన "జగనన్న అమ్మ ఒడి " కార్యక్రమం జూన్ 2022 కి మార్చబడినది.
2. ) జగన్న అమ్మ ఒడి సహాయం పొందాలంటే విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు కలిగి ఉండాలి. ( ఇది JAV GO లో మొదటి నుండీ ఉంది...కానీ కరోన లాక్ డౌన్ వలన 2020 & 2021 సంవత్సరాలలో మినహాయింపు ఇచ్చారు.
3. ) 75% హాజరు కోసం నవంబర్ 8, 2021 వ తేదీ నుండి ఏప్రిల్ 30 , 2022 తేదీ వరకు ఉన్న 130 రోజులలో 75% అంటే 98 రోజులు ఖచ్చితంగా హాజరైన విద్యార్థులకు మాత్రమే 2022 జూన్ లో జగనన్న అమ్మ ఒడి లబ్ది చేకూర్చబడును.
4. ) విద్యార్థుల హాజరును గణించడానికి నవంబరు 8 , 2021వ తేదీ లోపల బయొమెట్రిక్ అప్లికేషన్ సిద్ధం చేయబడుతుంది.
5.) మన బడి నాడు నేడు కు సంబందించి...మొదటి దశ పాఠశాలలో ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత కూడా ఇంకా మిగులు ఉన్న పాఠశాలల నుండి NABARD కాంట్రాక్టర్లకు (డైరెక్ట్ అకౌంట్ బదిలీ) పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి.
దీనికి సంబంధించి STMS Software లో తగు చర్యలు కొన్ని రోజులలో సిద్ధం చేస్తారు
నవంబరు 8 నుంచి విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు..
పిల్లల బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలో యూజర్ గైడ్.
0 comments:
Post a Comment