3,4,5 తరగతుల విలీన ప్రక్రియ – సూచనలు
కమిషనర్ పాఠశాల విద్య వారి ఉత్తర్వుల సంఖ్య 151- A&I-2020 మేరకు.. ఉన్నత పాఠశాల ప్రాంగణం లో ఉన్న / ఆనుకొని ఉన్న / 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలలోని 3,4,5 తరగతులను నవంబర్ 1వ తేదీ నుండి ఉన్నత పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది.
- 1,2 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహించ వలెను.
- 1,2 తరగతులకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి 130 నిష్పత్తి లో ఉపాధ్యాయులను కొనసాగించవలసి ఉంటుంది.
- మిగిలిన ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకి మార్పు చేయవలయును.
- జూనియర్ (తక్కువ సర్వీసు ఉన్న ) ఉపాధ్యాయుడుని తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో ఉండేలా చూడాలి.
- ఒకవేళ సీనియర్ ఉపాధ్యాయునికి ఉన్నత పాఠశాలలో బోధించుటకు తగిన అర్హతలు లేకపోతే జూనియర్ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాల కు మార్పు చేయవలెను.
- ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు కలిగిన PSHM యొక్క అభీష్టం మేరకు ఉన్నత పాఠశాలకు మార్పు చేయాలి. ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు లేనిచో ప్రాథమిక పాఠశాలలో కొనసాగించాలి.
- ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు బోధించుటకు తగిన వసతి లేనట్లయితే ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ లో 3,4,5 తరగతులు నిర్వహించాలి
0 comments:
Post a Comment