ఎ.పి.ఎస్.జీ.ఓ.స్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏ.పి.జె.ఏ.సి చైర్మన్ బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి శివా రెడ్డి ల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కలిసిన ఎ.పి.ఎస్.జి.ఓ.స్ రాష్ట్ర కార్యవర్గం -సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు..విజయవాడ: తేది: 15-09-2021 ఎ.పి.ఎన్.జి.ఓ.స్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏ.పి.జె.ఏ.సి చైర్మన్ బండి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఎ.పి.ఎన్.జి.ఓఎస్ రాష్ట్ర కార్యవర్గ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో 15-09-2021 తేదీన కలవడం జరిగింది. 1. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలిసిన రాయితీలు వారు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి వాటికి సంబందించిన వినతి పత్రాలను అందించారు.
2. 11వ పి.ఆర్.సి. నివేదకను కమిషన్ గారు ప్రభుత్వానికి తేది 05-10-2020 న సమర్పించినందున కాలాతీతం లేకుండాఉద్యోగ సంఘ నాయకులతో వెంటనే చర్చించి జూలై 1, 2018 నుండి 55% ఫిట్ మెంట్ తో పి.ఆర్.సి. ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు.
3. 01-07-2018 నుండి చెల్లించవలసిన కరువు భత్యం (డి.ఏ) బకాయలను చెల్లించుటకు ఉత్తర్యులు ఇచ్చినప్పటికీ, ఇంతవరకు అమలు కాలేదని, కావున సదరు డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
4. అలాగే కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం నిలుపదల (ఫ్రీజింగ్) చేసిన 3 డి.ఏ లను విడుదల చేసిందని, తదనుగుణంగా కొన్ని రాష్ట్రాలు, వారి ఉద్యోగులకు సదరు డి.ఏ లను విడుదల చేసారని, కావున మన రాష్ట్రంలో కుడా ఆ 3 డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని మరియు సదరు డి.ఏ ల లెక్కింపులో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం విడుదల చేయాలనీ కోరారు.
5. సి.పి.ఎస్. పై మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టక్కర్ గారి నివేదికపై ఏర్పాటు అయిన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదిక పై తక్షణమే నిర్ణయాలు తీసుకొని సి.పి.ఎస్. ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోనికి తీసుకొని రావాలని కోరారు. గ్రూప్ అఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదికను పరిశీలించి ఉద్యోగులు నాయకులతో చర్చించి త్వరలో ఉద్యోగులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
6. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఏర్పాటు చేసిన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదకను పరిశీలించి కాంట్రాక్టు ఉద్యోగులను అందరిని వెంటనే క్రమబద్ధీకరించవలేనని కోరారు. అలాగే కరోనా వలన ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్టు, అవుట్ సోర్చింగ్ ఉద్యోగుల కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని, అట్టి కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.
7. 4వ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మిగిలిన ఉద్యోగులకు పెంచిన విధంగా 2 సంవత్సరాలు పొడిగిస్తూ పదవి చిరమణ వయస్సును 60 సంవత్సరాలు నుండి 62 సంవత్సరాలు వరకు పెంచాలని కోరారు.
0 comments:
Post a Comment