CTET Notification 2021| Central Teacher Eligibility Test Applications Sep 20 సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. 20 నుంచి అప్లికేషన్లు ప్రారంభం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్‌ను సీబీఎస్సీ విడుదల చేసింది. 15వ ఎడిషన్ సీటెట్ రిజిస్ట్రేషన్లు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు ఈ పరీక్ష జరగనుంది. బీఈడీ చేసిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500. రెండు పేపర్లకు అయితే రూ.1200, రూ.600.
రిజిస్ట్రేషన్లు ప్రారంభం:సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 19
వెబ్‌సైట్: ctet.nic.in
0 comments:
Post a Comment