పిఆర్సి నివేదికపై ఆర్థిక శాఖ అధికారులతో పూర్తి చేసినట్లు, సిపిఎస్ రద్దు అంశంపై నివేదికలను చర్చించి తగు నిర్ణయాలను నివేదికలను సిఎంఓ కార్యాలయానికి పంపినట్లు, బదిలీలపై బ్యాన్ను కూడా ఎత్తివేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారు తెలిపినట్లు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. జోసఫ్ సుధీర్ బాబు, అసోసియేట్ అధ్యక్షులు కె. సురేష్బాబు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డిలు తెలిపారు.
సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో ప్రధాన సమస్యలు పిఆర్సి, సిపిఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, పెండింగ్లో డి.ఎ.లపై చర్చించుట జరిగినది. రాష్ట్రంలో కోవిడ్ 19తో సుమారు 800 మంది ఉపాధ్యాయులు మరణించిన వారికి గ్రీన్ చానల్ ద్వారా అన్ని శాఖలో ఉద్యోగాలు కల్పించాలని, మున్సిపల్, మోడల్, ఎయిడెడ్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్ళగా విద్యాశాఖ అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని వారు తెలిపారు.
0 comments:
Post a Comment