జగనన్న విద్యా కానుక – 100% బయోమెట్రిక్ - సూచనలు
1.పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులను https://studentinfo.ap.gov.in/EMS/ స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్ యాక్టివ్ ఆప్షన్ ద్వారా స్టూడెంట్ ఆధార్ నెంబర్ తో విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవాలి.
2. రిపోర్ట్స్ నందు కల Class wise Student Shoe Size report ను పరిశీలించి బూట్ల సైజు ఎంటర్ కానీ విద్యార్థుల చైల్డ్ ఐడి తీసుకొని దాని సహాయంతో సర్వీస్ నందుగల student Shoe size Entry చేయాలి.
3.Admission & Exit నందు గల Edit student details చేయాలి. ( ఇందులో అడ్మిషన్ నెంబర్ 5 అంకెలగా తీసుకోవాలి. ఉన్నత పాఠశాలలో ప్రస్తుతము ఆరో తరగతి చదువుతూ ఉంటే పూర్వపు తరగతి ఐదవ తరగతి ఉండాలి. ఇది సెలక్ట్ కావడం లేదు. దీనికి ప్రస్తుతం చదువుతున్న తరగతి ఒకసారి ఏడవ తరగతి సెలెక్ట్ చేసి మరల ఆరవ తరగతి సెలక్ట్ చేసినట్లయితే పూర్వపు తరగతి 5వ తరగతి సెలక్ట్ అవుతుంది.)
4. మన పాఠశాల నుండి ట్రాన్స్ఫర్ అయిన విద్యార్థులను సర్వీస్ నందుగల Online Transfer Certificate సెలెక్ట్ చేసుకుని TC ఇవ్వాలి.
5.ఈ విధంగా చేసినట్లయితే మన పాఠశాల యందు గల అందరి విద్యార్థుల వివరములు జగనన్న విద్యా కానుక యాప్ నందు 48 గంటల లోపల అప్డేట్ అవడం జరుగుతుంది.
0 comments:
Post a Comment