YSR Pellikanuka: పేదింటి ఆడపిల్లలకు 'వైఎస్సార్ పెళ్లి కానుక'
ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఇలా ఉన్నాయి.
దరఖాస్తు వివరాలు:
- మండల సమాఖ్య/మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.
- వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లి కుమార్తె బ్యాంక్ ఖాతాలో వేస్తారు.
- వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
- అనంతరం వివాహ దృవీకరణ పత్రం ఇస్తారు.
వైఎస్సార్ పెళ్లి కానుక ప్రోత్సాహకం
- ఎస్సీలకు సాంఘిక సంక్షేమ శాఖ-40,000/-
- ఎస్సీ కులాంతర చేసుకున్న వారికీ సాంఘిక సంక్షేమ శాఖ-75,000/-
- గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి -50,000/-
- బిసీలకు బీసీ సంక్షేమ శాఖ-35,000/-
- బిసీ కులాంతర వివాహం చేసుకున్న వారికీ బిసి సంక్షేమ శాఖ నుండి -50,000/
- వైఎస్సార్ పెళ్లి కానుక (Dulhan) మైనార్టీ సంక్షేమ శాఖ-50,000/-
- దివ్యాంగులకు దివ్యాంగుల సంక్షేమ శాఖ నుండి -1,00,000/-
- వైఎస్ఆర్ పెళ్లి కానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు, ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ,కార్మిక సంక్షేమ శాఖ-20,000/-
అర్హతలు:
- వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
- వధువు,వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి.
- ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
- వివాహం ఏపీలోనే చేసుకోవాలి.
- ఇద్దరికీ ఆధార్‌కార్డు,వధువు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి.
- వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి.
- వివాహ తేదీ నాటికి వధువుకు 18,వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
- తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు.
- వరుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడైనా వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే.
కావాల్సిన డాక్యుమెంట్స్
1. కులము - కమ్యూనిటీ మరియు జనన దృవీకరణ పత్రము.
2. వయసు - ఎస్ఎస్సి సర్టిఫికెట్ 2004 వ సంవత్సరం,ఆ తర్వాత పదవ తరగతి పాస్ అయిన వారికి(లేదా) డేట్ ఆఫ్ బర్త్(లేదా) ఆధార్ కార్డ్.
3. ఆదాయము (వధువు కి మాత్రమే) - తెల్ల రేషన్ కార్డు/ఇన్కమ్ సర్టిఫికెట్.
4. నివాసం - ప్రజా సాధికారిక సర్వే నందు నమోదు/హౌస్ హోల్డ్ సర్వే.
5. అంగవైకల్యం - సదరం సర్టిఫికెట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
6. వితంతువు - ఆధార్ నెంబర్ ఆధారముగా ఫించన్ డేటాతో పరిశీలిస్తారు.
వితంతువు అయ్యుండి పింఛన్ పొందకపోతే లేదా పించన్ డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత దృవీకరణ.
7. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు - ఎ.పి.బి.ఓ.సి.డబ్ల్యూ. డబ్ల్యూ.బి. చే జారీ చేయబడిన కార్మికుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డ్.
0 comments:
Post a Comment