Suspension: సస్పెన్షను కాలంలో ఉద్యోగి పరిస్థితి

సస్పెన్షను కాలంలో ఉద్యోగి పరిస్థితి : Khemchand vs. Union of India. AIR 1963, SC 687 కేసులో ప్రభుత్వోద్యోగి సస్పెన్షను ఉత్తరువు వల్ల, ప్రభుత్వం క్రింద అతని సర్వీసు ముగియదని, అభిప్రాయపడటం జరిగింది. సస్పెన్షను ఉత్తరువు ఈయబడి వున్నప్పటికి అతను సర్వీసులో కొనసాగుతాడు. సస్పెన్షను ఉత్తరువు వాస్తవ ప్రభావం, అతను సర్వీసులో కొనసాగుచున్నప్పటికీ, కర్తవ్యం నిర్వహణకు అతను అనుమతింపబడడు. సస్పెన్షనులో ఉన్న కాలంలో, జీవనాధార బత్తెం అని పిలువబడే కొంత మొత్తం మాంత్రం అతనికి ముట్టచెప్పడం జరుగుతుంది. అతను సస్పెండు కాకుండా వుండి వుంటే పొందటానికి హక్కున్న జీతబత్తెములకన్నా సాధారణంగా ఈ బత్తెం తక్కువగా వుంటుంది. ఆ తరువాతి కేసులో సుప్రీంకోర్టు, సస్పెన్షను ఉత్తరువు వలన ఈ క్రింది అశక్తతలు ఏర్పడ్డాయని తీర్పు ఇచ్చింది.


Suspension: సస్పెన్షను కాలంలో ఉద్యోగి పరిస్థితి

(1) సస్పెండు చేయబడిన ఉద్యోగి సస్పెండు చేయబడిన కాలంలో పూర్తి జీతభత్యములు పొందటకు హక్కు కలిగి వుండడు;

(2) జీవనాధార భత్యం పొందటానికి అతను సస్పెన్షను కాలంలో, ఏదేని ఇతర ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వృత్తి మొదలగునవి చేపట్టరాదు.

(3) సస్పెన్షను కాలంలో పదవి విరమణ చేయడానికి అతను అనుమతించబడడు; (4) పదవి విరమణ చేసే సమయంలో సస్పెన్షను ఉత్తరుపు ఈయటంతో ఆటోమేటి అతని సర్వీసు పొడిగించబడును. అప్పుడు, ఏఫ్.ఆర్. 56 (సి) క్రింద అతనిని సర్వీసులో నిలిపి వుంచుటకై తదుపరి ఉత్తరువులు చేయవలసిన అవసరం లేదు. P.R. Naik vs. Union of India, AIR 1972, SC 552.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top