డిపార్టుమెంటల్ టెస్టులు - టీచర్లు - OD సౌకర్యం - ఒక వివరణ

 డిపార్టుమెంటల్ టెస్టులు - టీచర్లు - OD సౌకర్యం - ఒక వివరణ

డిపార్టుమెంటల్ టెస్టులు జరిగే ప్రతిసారీ... టీచర్లు OD పై DT's రాయవచ్చా? ఒకవేళ OD పై DTs రాసే అవకాశం ఉంటే ఏయే DT's కి సదరు ఫెసిలిటీ ఉంటుంది? ముఖ్యంగా టీచర్లు ఎన్నిసార్లు OD పై డిపార్టుమెంటల్ టెస్టులు రాయొచ్చు? ఒకసారా? రెండుసార్లా? ఎన్నిసార్లు రాసినా OD ఉంటుందా? ఇవన్నీ ప్రశ్నలే..

చాలా మంది టీచర్లు, హెచ్.ఎం ల కోసం DT's పై ఒక సమగ్రమైన సమాచారం

GO Ms No.10 SE Dept Dated 23.1.2009,

GO Ms No 20 SE Dept Dated 27.1.2009

మరియు

GO Ms No 23 Dated 28.1.2009 ప్రకారం

స్కూల్ అసిస్టెంట్ మరియు LFL HM కేటగిరీలో 12 ఏళ్ళ స్కేల్* మంజూరుకు మరియు SGT/LP/PET తత్సమాన కేటగిరీల్లో  24 ఏళ్ళ స్కేల్  మంజూరుకు కింద పేర్కొన్న నాలుగు డిపార్టుమెంటల్ టెస్టులు పాసై ఉండాలి.


1.DT for Gazetted Officers of the Edn Dept. (GOT)


2.Account Test for Executive Officers. (EOT)


3.Spl Language Test for the Officers of the Edn Dept in Telugu Higher Standard. 

(Exemption: ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమానం లేదా హయ్యర్ డిగ్రీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది.)


4. Spl Language Test for the Officers of the Edn Dept in Hindi/Urdu of Lower Standard.

(Exemption: SSC పరీక్ష లేదా తత్సమానం లేదా ఆపై స్థాయిల్లో  HINDI/URDU ని ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది. టెన్త్ లో సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ లేదా ఉర్దూని అందరం కంపల్సరీ గా చదువుకున్నాం. కాబట్టి, ఈ టెస్ట్ నుంచి Exemption దాదాపు అందరికి వర్తిస్తుంది. ) 

O.D విషయం:

FR 9(6) Sub- Rule (b)(iii) ప్రకారం....

తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన డిపార్టుమెంటల్ టెస్టులకు హాజరయ్యే పీరియడ్ను డ్యూటీగా పరిగణించాలి. దీనికి పరిమితి లేదు. ఎన్నిసార్లయినా డ్యూటీగా పరిగణించాల్సిందే..!

ఐచ్చిక (Optional ) టెస్టులకు మాత్రం *కేవలం రెండు సార్లే డ్యూటీగా పరిగణిస్తారు.* రెండుకు మించితే లీవ్ పెట్టుకొని ఈ టెస్టులను రాయాల్సి ఉంటుంది. 

టీచర్లకు OD ఇలా...

SGT తత్సమాన కేడర్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ టీచర్లు, యాంత్రిక పదోన్నతి స్కేళ్ల మంజూరుకు నాలుగు టెస్టుల్లో  EOT, GOTలు విధిగా పాస్ కావాల్సిందే..!  కాబట్టి, ఈ రెండు టెస్టులు రాయడానికి అన్ని కేటగిరి ఉపాధ్యాయులకు పరిమితి లేకుండా ఆన్ డ్యూటీ లభిస్తుంది. మిగతా రెండు డిపార్టుమెంటల్ టెస్టులు కంపల్సరియా? కాదా? అనేది ఆయా టీచర్ల విద్యార్హతలపై ఆధారపడి ఉంటుంది. సర్టిఫికెట్స్ చూసి, హైస్కూల్ హెచ్ఎంలు, ఎంఈవోలు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి.


Dep.Tests రాయడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కల్పించిన OD రాయితీని ఇవ్వడమే న్యాయం. అవగాహన లోపంతో నిరాకరించడం, అన్యాయం.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top