ఎన్‌ఈపీ- 2020 కింద బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ కమిషన్ వంటి కొన్ని సంస్కరణలను అమలు చేయనున్నామని ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తాజాగా జరిగిన క్యాబినెట్ కాన్ఫరెన్స్‌లో మంత్రి జాతీయ విద్యా విధానంపై మాట్లాడారు.
ఎన్‌ఈపీ 2020: విద్యాశాఖ మంత్రి ప్రకటించిన ప్రణాళికలు..
1. ప్రభుత్వం చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది.
2. ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్ ప్రవేశపెట్టబోతుంది. దీంతో ఇకపై విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు స్కూల్ బ్యాగ్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, పుస్తకాలతో పని లేకుండా పాఠాలు నేర్చుకోవచ్చు.
3. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్లే క్లాస్, ప్రీ- ప్రైమరీ విభాగాలు తీసుకురానున్నారు.
4. విద్యార్థులను 10 రోజుల పాటు ఇంటర్న్‌షిప్‌కు పంపించడం వంటి కార్యక్రమాలను అదనపు పాఠ్యాంశాలలో చేరుస్తుంది.
5. శారీరక వికలాంగ బాలికలకు ఇచ్చే ప్రోత్సాహకాలను రూ.2000కు పెంచనున్నారు.
0 comments:
Post a Comment