ICDS: ఐసిడిఎస్ పర్యవేక్షణలోనే అంగన్వాడీ కేంద్రాలు

 అంగన్వాడీలు



★ అంగన్వాడీ కేంద్రాలు ఐసిడిఎస్ పర్యవేక్షణలోనే యథాతథంగా నడుస్తాయని,

విద్యాశాఖకు ఎటువంటి సంబంధమూ లేదని శిశు సంక్షేమ శాఖ డైరెక్టరు కృతికా శుక్లా పేర్కొన్నారు. 


★ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీలను విలీనం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్చర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన అంగన్వాడీ వర్కర్స్ ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. 


★ ఈ నేపథ్యంలో కృతికా శుక్లా యూనియన్లతో గురువారం చర్చలు జరిపారు. అద్దె భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గదుల్లోకి తరలిస్తామన్నారు.


★ రాష్ట్రం మొత్తమ్మీద 7702 సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లోకి మార్పు చేస్తున్నామని తెలిపారు.


★ మూడు నెలల్లో అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్లు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.


★ సూపర్ విసోర్ ప్రమోషన్లకు వయోపరిమితి 50 ఏళ్లకు సడలించి జిఓ ఇస్తామన్నారు.


★ వేతనంతో కూడిన మెడికల్ లీప్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.


★ పోషణ ట్రాకేర్ యాప్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదని, వైఎస్ఆర్ యాప్లోనే చేయాలని పేర్కొన్నారు.


★ కనీస వేతనం రూ. 21 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.3 లక్షలు, వేతనంలో సగం పెన్షన్, సంక్షేమ పథకాలు వర్తింపు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top