CPS VS OPS
పాత పెన్షన్ లాభాలు:-
1) ప్రభుత్వంతో జీవితాంతం సంబంధం ఉంటుంది.
2) సంవత్సరానికి రెండు DAలు, ఐదేళ్లకు ఒకసారి PRCతో పెన్షన్ పెంపు సౌలభ్యం.
3)పదవీ విరమణ తరువాత కూడా హెల్త్ కార్డులు
4) ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించనక్కరలేదు.
5) పెన్షన్ కొరకు ఉద్యోగి ప్రతినెలా చందా చెల్లించనవసరం లేదు.
6)పదవీ విరమణ తరువాత ఉద్యోగి మరణించిన, వారి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది.
7) జీవితాంతం పెన్షన్ సౌకర్యం.
8)కమ్యుటేషన్ సౌలభ్యం.
9) గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది.
10) ఫ్యామిలీ పెన్షన్ కొరకు ఉద్యోగి ఒక్క రూపాయి చెల్లించనవసరం లేదు.
CPS విధానం - నష్టాలు:-
1) పదవీవిరమణ తరువాత, ఉద్యోగికి, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.
2) పదవీవిరమణ తరువాత, DAలు, PRC వర్తించవు.
3)ఉద్యోగి ప్రతినెలా బేసిక్ పే + DA పై 10% అమౌంట్ చెల్లించాలి.
4)PFRDA కు ఉద్యోగి, ప్రతి సంవత్సరం నిర్వహణ చార్జీలు చెల్లించాలి.
5) పదవీ విరమణ తరువాత, హెల్త్ కార్డులు వర్తించవు.
6)షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్. అది కూడా 70 సంవత్సరాల వరకే.
7)పదవీ విరమణ తరువాత, తీసుకునే 60% అమౌంట్ కు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మిగిలిన 40% అమౌంట్ తో ఆన్యూటీ ప్లాన్ లు కొనవలసి ఉంటుంది.
8) పెన్షన్ కు ఎటువంటి గ్యారంటీ లేదు.
9)పదవీ విరమణ తరువాత ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి దిక్కు లేదు. ఫ్యామిలీ పెన్షన్ వర్తించదు.
10) ఉద్యోగం చేస్తూ మరణించిన CPS ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది. అయితే అప్పటివరకు CPS ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలి.
11) పదవీ విరమణ తరువాత కూడా ప్రభుత్వ పథకాలకు అనర్హులు.
12) గ్రాట్యుటీ వర్తిస్తుంది.
0 comments:
Post a Comment