పదవిలో ఒక వ్యక్తి సీనియారిటీ అనేక సందర్భాలలో పరిగణనలోనికి తీసుకోబడుతుంది. దీనిపైన స్పష్టమైన అవగాహన అవసరం. పదవిలో ఉద్యోగి సీనియారిటీ ఆ ఉద్యోగి న్యాయపరమైన హక్కుగా గుర్తించాలి.
1.Memo. NO.351411/64, Edn. dt: 4-1-1965 మేరకు Taken Over కాబడిన ఎయిటెడ్ ప్రాథమిక ఉపాధ్యాయులు అదే స్టేటస్లో కొనసాగించవలసినదిగా ఆదేశాలు జారీ చేయబడినవి. అంటే ఒక ప్రాథమిక పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడిని School Asst గా బదిలీ చేయరాదు.
2. Untrained సర్వీసు సీనియార్టీకి పరిగణించబడదు. Dpl. Rc. No. 2020/F56, dt 15-12-1956.
3. ఎ.పి. స్టేట్ & సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996, 35వ నిబంధన మేరకు ఒక వ్యక్తి యొక్క సర్వీసు సీనియారిటీని ఆ వ్యక్తి యొక్క ఆ క్లాసు, కేటగిరి లేదా గ్రేడ్లో చేరిన మొదటి నియామకపు తేదీ నుండి పరిగణనలోనికి తీసుకోవలయును. ఒకరికంటే ఎక్కువమందిని ఏకకాలంలో నియామకం చేస్తే రిజర్వేషన్లు, ర్యాంకు పరిగణనలోనికి తీసుకొని సీనియారిటీని నిర్ణయించాలి.
4.నోషనల్ ప్రమోషన్ ఇచ్చే సందర్భముగా, వ్యక్తులను, సర్వీసు నుండి తొలగించిన సందర్భాలలో వారి పునఃనియామకము జరిగితే ఆ తేదీ నుండి మాత్రమే ఆ సర్వీసును సీనియారిటీకి పరిగణించాలి.
5. రూల్ 34వ నిబంధన మేరకు ఒక క్లాసు ఒక కేటగిరి లేదా గ్రేడ్ వేరు వేరు యూనిట్లకు సబంధించిన నియామకంఅయితే ఆ యూనిట్లకు సంబంధించిన సర్వీసును పరిగణనలోనికి తీసుకొని ఇంటిగ్రేటెడ్ సీనియార్టీ తయారు చేసి దాని ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలి.
6. రూల్ 35 మేరకు ఒక నియామకపు యూనిట్ నుండి మరొక యూనిట్కు వారి కోరిక మేరకు బదిలీ అయితే రెండవ యూనిట్లో అతను చేరిన తేదీ నుండి సర్వీసు పరిగణనలోనికి తీసుకోవలయును.
7. పరిపాలన సంబంధమైన కారణముల వలన ఒక యూనిట్ నుండి మరియొక నియామక యూనిట్కి లేదా రీపాట్రియేషన్ ద్వారా బదిలీ అయితే మొత్తము సర్వీసు పరిగణనలోనికి తీసుకోవలయును.
8. 36వ నిబంధన మేరకు APPSC/DSC లేదా మరొక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ప్రత్యక్ష నియామకము జరిగితే అభ్యర్థుల ర్యాంకు మరియు రోస్టర్ పద్ధతిని అనురించి సీనియార్టీ నిర్ణయించడం జరుగుతుంది. ప్రమోషన్ జరిగేటప్పుడు పై కేడర్ సీనియార్టీ అందరి ప్రొబేషన్ తేదీ సమానమైన సందర్భములో వ్యక్తుల వయస్సుల ఆధారముగా సీనియార్టీ నిర్ణయిస్తారు.
9.Reallotted అభ్యర్థుల సీనియార్టీని ఆ ఎంపిక జాబితాలోని చివరి అభ్యర్థి తరువాత చేర్చవలయును.
10. Cir. Memo 57759/ Ser. A/ 2004 GAD, dt : 20-5-04 ప్రకారము settled సీనియార్టీ జాబితాలను reapen చేయవలసిన అవసరము లేదు.
11. ITDAలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టును కేడర్వైజ్ ప్రకటించవలసినదిగా Rc.No.01/2737/2004 కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ గారు ఉత్తర్వులిచ్చియున్నారు.
12. భాషా పండితుల సీనియార్టీని వారు విలీనం అయిన తేదీ నుండి పరిగణనలోనికి తీసుకోవలసినదిగా Memo. 17835/Ser-1 (4) 2005-1 Edn. dt : 5-10-2005లో ఆదేశించడం జరిగినది.
13. రూ.398/- జీతంతో నియామకము పొంది యస్.జి.టి. ఉపాధ్యాయుల సర్వీసును ఆ కేడర్ లో వారు రెగ్యులర్ ఖాళీలో విలీనం అయిన తేదీ నుండి పరిగణించవలసినదిగా Rc. 6471/ 03-3-/ DSE, dt: 7-1-06 ద్వారా ఆదేశించడమైనది.
14. ఒక డీఎస్సీలో ఎంపిక కాబడి వెంటనే విధుల్లో చేరక, తదుపరి డీఎస్సీలలో ఎంపికైనవారు చేరిన తరువాత, చేరినప్పటికీ ముందు డీఎస్సీ వారినే సీనియర్లుగా పరిగణించాలని Rc. No. 9603-1/25/DSC, dt 18-1-2006 ద్వారా ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
15. ఒకే కౌన్సిలింగ్ నియామకపు, ప్రమోషన్ జరిగే సందర్భములో feeder category service సీనియార్టీగా పరిగణించాలి. L.Dis.No.2907/D3-2/ 2005, DSE df 28-2-06 & C & DSE Rc.No.61/ C3-1/2003, dt: 29-9-2009 & 6-11-2009.
16, మున్సిపాలిటీ పాఠశాలలో ఇంచార్జి నియామకమునకు సర్వీసు సీనియార్టీ పరిగణించడానికి Rc.No.355/ V-3/06 DSE, Dt: 13-4-2006 వివరణ ఇవ్వబడింది.
17. ZP సర్వీసు నుంచి Govt. Serviceలో విలీనం పొందిన వారికి పూర్తి సర్వీసు పరిగణనలోనికి తీసుకొనవలెనని G.O.Ms.No.147, Edn. 7-11-2000 జారీ చేయబడ్డాయి.
0 comments:
Post a Comment