*రాష్ట్రాల సిఎంలు, యుటిల అడ్మినిస్ట్రేటర్లకు వైద్యులు, విద్యావేత్తల లేఖ
పాఠశాలల పున:ప్రారంభించి ప్రత్యక్ష తరగతుల నిర్వహణ అంశాన్ని తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ 56 మంది వైద్యులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖను ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రదాన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చైర్‌పర్సన్‌కు పంపారు. సుదీర్ఘకాలం పాఠశాలల మూసివేత వల్ల దేశంలోని పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తగినరీతి జాగ్రత్తలు పాటిస్తూ తక్షణమే పాఠశాలలను తెరవాలని కోరారు. పాఠశాలల పున్ణప్రారంభానికి విద్యార్థులకు వ్యాక్సిన్ ముందస్తు అవసరం కాదని లేఖలో వారు పేర్కొన్నారు.
విద్యా సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/HehnyMotzjfJm9atrk4WGY
0 comments:
Post a Comment