94 శాతం టీచర్లకు వ్యాక్సిన్ పూర్తి
94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆది మూలపు సురేష్ మంగళవారం తెలిపారు. కేవలం 15,083 మందికే వ్యాక్సిన్ వేయాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే 100 శాతం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశా ఖలో 100 శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి కాగా కడపలో 99%, విజయనగరం, చిత్తూరు, నెల్లూరుల్లో 98%, ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే 86% పూర్తయిందని, అక్కడ ఇంకా 4 వేల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు.
0 comments:
Post a Comment