పాఠశాల విద్యాశాఖ 'జగనన్న విద్యా కానుక 2021-22 స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు "మన బడి: నాడు-నేడు' - మార్గదర్శకాలు Rc.SS 16021

పాఠశాల విద్యాశాఖ 'జగనన్న విద్యా కానుక 2021-22 స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు "మన బడి: నాడు-నేడు' - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర జిల్లా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా మన బడినాడు-నేడు అదే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో రూ.3,659 కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరచడం జరిగినది. మొదటి దశ పూర్తి అయిన సందర్భంగా దీనిని ప్రభుత్వం 2021 ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేయనున్నారు. అలాగే అదేరోజు రెండవ దశలో భాగంగా 16,368 పాఠశాలల్లో రూ.4535 కోట్లతో మౌలిక వసతులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమం అదే రోజు ప్రారంభించనున్నారు.


గత సంవత్సరం "జగనన్న విద్యా కానుక లో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు మరియు రెండు జతల సాక్కులు, బెల్టు, బ్యాగు మరియు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో జధనంగా 6 నుండి పదో తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్ డిక్షనరీల(బొమ్మల నిఘంటువు) ను అందించనున్నారు. దీనికోసం రూ. 731.30 కోట్లతో 47, 32, 064 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

మన బడి: నాడు-నేడు' మొదటి దశ ముగింపులో భాగంగా, సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తమ సేవలందించిన ఇద్దరు హెడ్ మాస్టర్స్, ఇద్దరు ఇంజనీర్లు మరియు రెండు పేరెంట్స్ కమిటీలను గుర్తించి, వారికి తగిన విధంగా సన్మానించాలని అభ్యర్థించారు

జగనన్న విద్యాకానుకలో భాగంగా పాటించవలసిన విషయాలు:

• జగనన్న విద్యాతామక' స్టూడెంట్ కిట్లును 16,08:2021 నుండి 31 08 2021 లోపు పంపిణీ చేయాలి. మొదట వచ్చిన విద్యార్థికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి.

.రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.ఒక రోజులో గరిష్టంగా 30-40 మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలి.

• ప్రతి పాఠశాల నందు 'స్టూడెంట్ కిట్' సిద్ధం చేసి విద్యార్థులకు అందించేందుకు సన్నద్ధులై ఉండాలి. ఏ తరగతి విద్యార్థికి ఏయే వస్తువులు బ్యాగులో వేసి సిద్ధం చేయాలో 'అనుబంధం-1'లో పొందుపరచడమైనది.

తరగతి వారీగా బాలబాలికలకు విడివిడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉండాలి. సులభంగా, త్వరితగతిన సంబంధిత విద్యార్థికి కిట్ అందించడానికి ప్రతి బ్యాగు మీద ఉన్న పౌచ్ లో దిగువ తెలిపినట్లు పేపర్ పెట్టుకోవాలి.

• అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి 

• జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని నిర్వహించడానికి 16.08.2021 న 'మన బడి: నాడు నేడు' పనులు పూర్తయిన లాగిన్ నందు నమోదు చేయవలసి ఉంటుంది.పాఠశాలల్లో జిల్లా కేంద్రం నందు ఒక పాఠశాలను, ప్రతి నియోజకవర్గం నందు ఒకటి. ఇవికాకుండా మిగిలిన మండలాల్లో ఒక్కో పాఠశాలను ఎంపిక చేసుకోవాలి. 01.09.2021 నాటి నుండి కొత్త ప్రవేశాలు (అడ్మిషన్లు) వివరాలు, అందిన సరుకునందు ఏమైనా చినిగినా, పాడైనా, బూట్లు మిస్ మ్యాచ్ వంటివి ఉన్నా పాఠశాలనందు ఆ వివరాలను నమోదు చేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి, సదరు మండల విద్యాశాఖాధికారి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వారికి లేదా జిల్లా సీఎంవోకు తెలియపరచాలి.


• జిల్లా కేంద్రం నుండి డిక్షనరీలు తరలించడానికి ట్రాన్స్ పోర్టరును ఎంపిక చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ కు అయ్యే ఖర్చు చెల్లించడానికి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వం లో జిల్లా డీపీసీ ఆమోదం తీసుకుని సంబంధిత జిల్లా డీపీవో మేనేజ్ మెంట్ కాస్ట్ నుండి చెల్లించాలి. మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్సులకు, అక్కడి నుండి పాఠశాలలకు సరుకు సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును కూడా జిల్లా డీపీసీ వారి ఆమోదంతో తగిన బిల్లులు సమర్పించిన తరువాత జిల్లా డీపీవో మేనేజ్ మెంట్ కాస్ట్ నుండి చెల్లించాలి..

.జిల్లా నందు సేకరించిన పూర్తి సమాచారం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లేదా జిల్లా సీఎంవో రాష్ట్ర కార్యాలయానికి 15.09.2021 నాటికి తెలియజేయాలి. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులు స్వీకరించబడవు.

'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్లును సరఫరా చేసేటప్పుడు సరుకులో ఏమైనా నాణ్యతా లోపాలు గుర్తించినట్లయితే. వాటిని సరఫరా చేయకుండా ఆ సరుకును రిజక్ట్ చేసి ఆ వివరాలను స్టాకు రిజిస్టర్ నందు నమోదు చేయాలి.


Download Guidelines

JVK Acquittance


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top