సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా చేరిన ఉద్యోగులు ఆగస్ట్ 15 నుంచి పోలీస్ యూనిఫాం ధరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14,313 మంది మహిళా పోలీసులకు యూనిఫాం అలవెన్స్ మంజూరు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీస్ శాఖలో అంతర్భాగమని పేర్కొంటూ, వారికి కానిస్టేబుల్ హోదాను కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గత జూన్‌లో ప్రకటించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment