ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ (సి.వి.ఆర్.ఓ.ఆర్.) శాఖ ఉత్తర్వులు జి.ఒ.ఆర్.టి.నెం. 181, తేది.02.07.2021 అనుసరించి 2020-21 సంవత్సరానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందలి షెడ్యూల్ కులములు మరియు షెడ్యూల్ తెగలు కొరకు గ్రూప్-4 సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్ట్, టెక్నికల్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్, ఫిషర్ మస్, ల్యాబ్ అటెండర్, నాల్గవ తరగతి సర్వీసు నందు ఆఫీసు సబార్డినేటు, కాపలాదారు, వంట మనిషి, స్వీపర్, గర్డెనర్, మెస్సంజర్, వాటర్స్-కం-వాచ్మస్ మొదలయిన ఉద్యోగముల నిల్వ ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా దరఖాస్తులు కోరబడుచున్నవి.
ధరఖాస్తులు స్వీకరించుటకు ప్రారంభ తేది. 07.07.2021
ధరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేది: 21.07.2021
మొత్తం ఖాళీలు: 59
Sri Pottisrramula Nellore Dt: బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అభ్యర్ధులు గమనించ వలసిన ముఖ్యమైన సూచనలు:
1.దరఖాస్తు చేసే అభ్యర్థి కనీస వయస్సు తేది :- 10,06,2021 నాటికి 18 సంవత్సరములు నిండి ఉండవలెను.అలాగే గరిష్ట వయసు 47 (4245) సంవత్సరములు దాటి ఉండరాదు. కుల దృవీకరణ పత్రమును సంబంధిత జారీ చేయు అధికారి నుండి పొండి ఉండవలెను. వెబ్ సైట్ https://gramawardsachivalayam.ap.gov.in నందు గల సంబంధిత ధరఖాస్తు లోని అన్ని కాలమ్స్ ఆన్ లైన్ లో పూరించి సంబంధిత ధృవీకరణ పత్రాలు జత పరచి ఆ యొక్క దరఖాస్తు ప్రతిని, ఉపసంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ వారి కార్యాలయానికి అభ్యర్థి నిర్ణీత సమయములో ధరఖాస్తుతో పాటు 1. కుల ధ్రువీకరణ పత్రము
2. విద్యార్హత ధ్రువీకరణ పత్రములు
3. ఎంప్లాయిమెంట్ కార్డు
4. 4వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్
5. స్థిర నివాస ధ్రువీకరణ పత్రములు 6, పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు 2 ఎన్వలప్ కవర్లు మొదలగు వాటి ప్రతులను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి పూర్తి చేసిన దరఖాస్తును తేది: 21-07-2021 సాయంత్రం 05.00 గంటల లోగా స్వయంగా, ప్రతినిధి, మరియు పోస్టల్ ద్వారా కాని వచ్చి దరఖాస్తును సమర్పించగలరు. పోస్టల్ వారి జాప్యముకు ఈ కార్యాలయము బాధ్యత వహించదు.రిజర్వు చేయబడిన టైపిస్ట్ పోస్టులు మరియు ఇతర పోస్టులు ప్రకటించ బడి, గత నియామక ప్రక్రియ లో అర్హులైన అభ్యర్థులు లేని సందర్భములో ప్రస్తుత నోటిఫికేషన్లో అదే విభాగం వారికి పోస్టులు ప్రకటించ బడును, ఈ నియామక ప్రక్రియ లో అర్హులైన అభ్యర్ధులు లేనిచో సదరు ఖాళీలను తదుపరి విభాగముల వారికి పూర్తిగా కాని పాక్షికముగా బదిలీ చేయ బడును.మహిళలకు ప్రకటించ బడిన పోస్టులు అర్హులైన అభ్యర్ధులు లేని చో అది విభాగంలో గల పురుష అభ్యర్ధులకు 'ప్రాధాన్యత కల్పించ బడును.ఒక అభ్యర్ధి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలచినచో ప్రతి పోస్టునకు విడివిడిగా ధరఖాస్తు చేయవలెను.ఏ పోస్ట్ సకైనా ఎంపికైన అభ్యర్ధి అట్టి ఉద్యోగమునకు సంబంధించిన విధులు రానే ఖచ్చితముగా నిర్వర్తించవలసి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రోజే అభ్యర్థి అట్టి ధృవీకరణ పత్రము కమిటీ వారికి అందచేయాలి.ఏ కారణం చేతనైన ప్రకటించిన అభ్యర్థి తిరస్కరణకు గురైతే మెరిట్ లిస్టులోని తర్వాత అభ్యర్ధిని పరిగణలోకి తీసుకోబడుతుంది.అర్హత లేని మరియు అసంపూర్తి దరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు చేయబడవు.
గ్రూప్-4 రిక్రూట్మెంట్ విధానం:
1) జి.ఒ..యం.యస్.నెం.218, తేది: 31.12.2015 ప్రకారం యస్.సి/యస్.టి.బ్యాక్ లాగ్ ఉద్యోగముల భర్తీ ప్రక్రియలో వ్రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు రద్దు చేయబడినవి.
2) యస్.సి/యస్.టి బ్యాక్ లాగ్ నియామక కార్యక్రమములో ప్రస్తుత ఎంపిక అర్హత' నిర్దేశించబడిన విద్యాపరీక్షలలో పొందిన మార్కుల క్రింద మెరిట్ ప్రాతిపదికపై ఎంపిక ఉంటుంది.
3) జి.ఓ.యం.యస్.నెం. 133, 135 తేది: 12.05.2014 ప్రకారం డిగ్రీలోని మార్కుల మెరిట్ ప్రకారంఎంపిక చేయబడి మరియు సర్వీసు కమీషన్/డి.యస్.సి.చే నిర్వహించబడు ఆఫీసు ఆటోమేషన్ మరియు కంప్యూటర్ వినియోగముపై పరీక్ష నిర్వహించబడును, ఆయా పరీక్షలలో ఉత్తీర్ణులైన వారిని మెరిట్ ప్రకారం జూనియర్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టులలో నియామకములు జరుగుతాయి..టెక్నికల్ పోస్టులు ఉద్యోగాల నియామక ప్రక్రియ విధానం:- అకాడమిక్ విద్యార్హత లోని మార్కులు మరియు టెక్నికల్ విద్యార్హత లోని సాధించిన మార్కులును పరిగణనలోకి తీసికొని మాత్రమే నియామకాలు జరుగుతాయి.క్లాప్-IV ఉద్యోగాల నియామక ప్రక్రియ విధానం:- ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న ఆకాడమిక్ విద్యార్హత లో సాధించిన మార్కులును పరిగణనలోకి తీసికొని మాత్రమే నియామకాలు జరుగుతాయి.
వంట మనిషి
పోస్టునకు డెమో / నైపుణ్య పరీక్ష ఆధారముగా నియమాకాలు జరుగుతాయి. ఈ ప్రకటనలోని ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు లేదా పెరగవచ్చు మరియు మార్పులు చేర్పులు లేదా ప్రకటనను.పూర్తిగా రద్దు పరచే అధికారము జిల్లా కలెక్టర్ వారికి మాత్రమే కలదు.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు చేసుకోనటకు అర్హులు. అభ్యర్ధులు సమర్పించిన సర్టిఫికేట్ లు ఏ కారణం చేతనైన నకిలీ సర్టిఫికేట్ అని గుర్తించినచో వారి పై చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకొనబడును.
16. పూర్తి సమాచారము కొరకు అవసరమైన చో కార్యాలయపు పని వేళలో 10.A.M నుండి 5.P.M. పని దినములలో ఫోన్ నెంబర్ 9989943408 ఫోన్ చేయవచ్చు.
17.పూర్తి ప్రకటన, నిబంధనలు శుణ్ణంగా చదివి, జత చేయు పత్రాలు, దరఖాస్తుకు ఫారముకి జత చేసి ధరఖాస్తు ఫారమును ప్రకటన వెలువడిన తేది నుండి నిర్ణీత గడువు లోపల, కొండాయపాలెం గేటు, ఉపసంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి సమర్పించ వలెయును. దరఖాస్తు ఫారము, ప్రకటన పూర్తి వివరములు జత చేయు పత్రములు కొరకు వెబ్ సైట్ https://gramawardsachivalayam.ap.gov.in ను సందర్శించ గలరు
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/E4UBFCsZYBLLudU8uWqT6U
0 comments:
Post a Comment