*దేశంలోని పిల్లల్లో సరిపడా రోగ నిరోధకశక్తి ఉంది
దశలవారీగా పాఠశాలలు తెరచేందుకు సమయం వచ్చిందని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రన్‌దీప్ గులేరియా చెప్పారు. దేశంలోని పిల్లల్లో సరిపడా రోగ నిరోధకశక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలు తెరచు కోవచ్చని తెలిపారు. ఒక వేళ కేసులు పెరుగుతున్న ధోరణి కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకొని పాఠశాలలను మూసివేయవచ్చని పేర్కొన్నారు. పాఠశాలలను రోజుమార్చి రోజు పెట్టడం, దశలవారీగా తెరవడం వంటి ఐచ్ఛికాలను ఆయా జిల్లాలు ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు.
0 comments:
Post a Comment