పాఠశాల గ్రాంట్ల సమాచారం 2020-21 కి సంబంధించి ఏఏ గ్రాంట్లు ఎంత పడ్డాయో (PD A/C) వివరించే ప్రయత్నం...
★ ముందుగా ఇప్పుడు అందరూ UTILIZATION సర్టిఫికెట్ ఇవ్వాలి కాబట్టి మీకు పడిన గ్రాంట్స్ అన్నీ మీరు PD A/C నుండి BILL చేసి డ్రా చేయకపోయినా సరే అందరూ UTILIZATION నింపాలి.
★ UTILIZATION సర్టిఫికేట్ 2020-21 సంవత్సరానికి 2021 మార్చి -31 వరకు ఖర్చు చూపించాలి.మీరందరూ డ్రా చేయకపోయినా ఖర్చు పెట్టారు కాబట్టి బాలన్స్-NIL అని చూపించాలి. ప్రతి పాఠశాలకు ఏమేమి గ్రాంట్స్ పడ్డాయో చూడండి..
I. COMPOSITE SCHOOL GRANT::
★ 1-15 లోపు పిల్లలు ఉంటే : 12,500/-
★ 15-100 లోపు పిల్లలు ఉంటే -25,000/- ★ 100-250 లోపు పిల్లలు ఉంటే: 50,000/- ★ 250 పైన ఉంటే 75,000/-
II. SAFETY PLEDGE గ్రాంట్::
★ పాఠశాల గోడ మీద సేఫ్టీ PLEDGE రాయడానికి ప్రతి పాఠశాలకు 500/- పడ్డాయి
III.యూత్ మరియు ECHO క్లబ్ గ్రాంట్::
★ యూత్ మరియు ECHO క్లబ్స్ ఏర్పాటు మరియు నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు 5000/- పడ్డాయి.
IV. SCHOOL SAFETY GRANT::
★ ప్రతి పా::ఠశాలకు 500/- మరియు ఒక్కొక్క టీచర్ కు 1000/- చొప్పున పడ్డాయి. ఉదాహరణకు 2 టీచర్లు ఉంటే. 500+2×1000=2500 పడ్డాయి.
V: PC మీటింగ్స్ గ్రాంట్::
★ పాఠశాలలో PC మీటింగ్స్ నిర్వహణ కొరకు 2,110/- గ్రాంటు ఒకసారి పడింది.
VI: PC మీటింగ్ గ్రాంట్::
★ పాఠశాలలో PC మీటింగ్స్ నిర్వహణ కొరకు 3,000/- మరొక సారి పడ్డాయి.
VII. LOGO గ్రాంట్::
★ పాఠశాలలో APSS LOGO డిస్ ప్లే కొరకు ప్రతి పాఠశాలకు 1000/- గ్రాంట్ పడింది.
★ పై 7 రకాల గ్రాంట్స్ మన పాఠశాలల PD అకౌంట్ నందు జమ చేయడం జరిగింది. పై సారాంశాన్ని బట్టి మీ పాఠశాలకు ఎంత గ్రాంట్ పడిందో చూడండి. అంత మొత్తానికి UTILIZATION సర్టిఫికెట్ ఇవ్వండి.త్వరలోనే ఆడిట్ ఉంటుంది కాబట్టి సంబంధిత VOUCHERS కూడా సిద్ధం చేసుకోండి.VOUCHERS అన్నీ 31-03-2021 లోపు ఉండాలి.
★ *గమనిక:* మేము ఇంకా డ్రా చేయలేదు కదా మేము ఇవ్వాలా అని అడుగుతున్నారు. డబ్బులు వేటికీ ఖర్చు చేయాలో పిసి కమిటీ తో పాటు అందరు ఉపాధ్యాయుల సంతకాల తో తీర్మానాలు రాసి, డ్రా చేయాలి.
★ మనం 31-03-2021 లోపు ఖర్చు వివరములు ఆడిట్ నందు చూపిస్తే డ్రా చేయడం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి UTILIZATION అందరూ ఇవ్వగలరు.
0 comments:
Post a Comment