ఒక్కో కిట్లో 8 పుస్తకాలు
ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు చేసేం దుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం పీపీ-1, పీపీ-2 పాఠ్య పుస్తకాలు రూపొందిం చారు. ఆయా పుస్తకాల్లో ఆంగ్లం, తెలుగు, గణిత అక్షరాలు, చిన్నపాటి కథలను పాఠ్యాంశాలుగా పొం దుపరిచారు.
పీ-1, పీపీ-2 కిట్లు:
కోవిడ్ తీవ్రత తగ్గి కేంద్రాలు తెరిచిన తర్వాత కార్యకర్తలు పూర్వ ప్రాథమిక విద్యను బోధించనున్నారు. మూడేళ్లు నిండిన చిన్నా రులకు పీపీ-1 పుస్తకాలు, నాలుగేళ్లు నిండిన వారికి పీపీ-2 పుస్తకాలు ఇవ్వనున్నారు. ఒక్కొ కిట్లో 8 పుస్తకాలు చొప్పున ఉన్నాయి. వాటిలో ఆంగ్లం, తెలుగు, గణితం, ఆంగ్లం వర్క్ పుస్తకం, డ్రాయింగ్, యాక్టివిటీ తదితర సబ్జెక్టుల పుస్తకాలు ఉన్నాయి.
0 comments:
Post a Comment