★ ఇక పోస్ట్‌మేన్ సహాయంతోనూ ఇంటి వద్దే ఆధార్ కార్డులపై మొబైల్ నంబర్లను అనుసంధానం చేసుకోవచ్చు.
★ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా పోస్ట్‌మేన్‌లకు ఆధార్ కార్డుదారుల మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు.
★ 650 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లలో 1.46 లక్షల మంది పోస్ట్‌మేన్లు, గ్రామీణ్ డాక్ సేవక్స్ (జీడీఎస్) నెట్‌వర్క్ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
★ పోస్ట్‌మేన్ సహాయంతో ఇంటివద్దనే ఎవరైనా తమ ఫోన్ నంబరును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది.
★ బ్యాంకులు లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందించాలనే తమ లక్ష్యాలను దీని ద్వారా సాకారం చేసుకోనున్నట్లు ఐపీపీబీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో జె.వెంకటరాము తెలిపారు.
★ త్వరలో పిల్లల ఆధార్ నమోదు ప్రక్రియను దీని ద్వారా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు
0 comments:
Post a Comment