కరోనా నేపథ్యంలో అనేక రంగాలు దెబ్బతిన్నా ఐటీ రంగం మాత్రం పుంజుకుంది. ఈ రంగంలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. అనేక మంది కోవిడ్ దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రం ఆ పరిస్థితి రాలేదు. ఇంకా అనేక కంపెనీలు వేతనాల పెంపుతో పాలు వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో తమ సిబ్బందికి ప్రోత్సహకాలు సైతం అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ HCL కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మొత్తం 20 వేల నుంచి 22 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని తెలిపింది. ఈ సంఖ్యను దాటే అవకాశం కూడా ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు HCL చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ వీ.వీ.అప్పారావు వివరాలను వెల్లడించారు. గతేడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 14,600 మంది ఫ్రెషర్లను నియమించుకుందని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment