ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళు సెలవులు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

 * కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం

కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మనదేశంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, విద్య, వైద్య, రెవెన్యూ విభాగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సెలవు సమయంలో వారికి సగం జీతం ఇస్తారు. ఖర్చును తగ్గించుకునేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. మధ్యప్రదేశ్కు ఇప్పటికే 2.53 లక్షల కోట్ల అప్పులున్నాయి. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఈ నేప థ్యంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిరర్ధక ఆస్తులను అమ్మి రూ.500 కోట్లను సమీకరించారు. ఇప్పుడు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతంలో సగం ఆదా అవుతుంది. తద్వారా యేటా రూ.6వేల కోట్లు మేర ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top