TS PRC 2021 Telangana Revised Pay Scales 2021 GO:51

  TS PRC 2021 Telangana Revised Pay Scales 2021 GO:51  విడుదలైన పీఆర్సీ జీవోలలో ముఖ్యమైన అంశాలు


➡ఉద్యోగులు జూన్‌ 1, 2021 నుండి నగదు రూపంలో జులై 1 న కొత్త జీతం అందుకుంటారు.


➡ఏప్రిల్,మే నెల బకాయిలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు.(ఎపుడు ఇస్తారని స్ఫష్టత లేదు)


➡01.04.20 నుండి 31-03-21 వరకు బకాయిలు ఉద్యోగి రిటైర్‌మెంట్‌ తర్వాత ఇస్తారు.


➡HRA తగ్గించారు. (24/17/13/11)


➡జులై 1,2018 న ఉద్యోగి మూలవేతనం ఆధారంగానే నూతన వేతనం ఫిక్సేషన్‌. కాబట్టి 2017 TRT కొంత ఇబ్బందె.

Telangana State PRC High lights.....      

 ➡️ The monetary benefit shall be allowed from 01.04.2020.

➡️ The arrears for the period from 01.04.2020 to 31.03.2021 shall be paid at the 

time of superannuation of the Government employee or to the legal heirs in 

case of demise of the employee.

➡️ The arrears for the period from 01.04.2021 to 31.05.2021, will be paid during 

the financial year 2021-22. 

➡️ The salary in the Revised Pay Scales, 2020 will be paid from the month of 

June, 2021 payable in July, 2021.


21 నెలలు(1-7-2018 to 31-3-2020) నోషనల్ గా (ఎలాంటి ఆర్థికంగా లాభం లేకుండా)


ఒక సంవత్సరం (1-4-2020 to 31-3-2021)ఎరియర్స్ రిటైర్మెంట్ తర్వాత


కేవలం రెండు నెలల ఎరియర్స్(1-4-2020 to 31-5-2021)ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించబడతాయి.


AP lo 27% IR ను 1-7-2019 నుంచి తీస్కుంటున్నారు


Telangana HRA slabs:


30%, 20%, 14.5%, 12% గా ఉన్న HRA slabs  24%,17%,13%,11% గా మార్పు


TELANGANA  PRC GOs ( RPS- 2020) GO 51 to GO 60 ( 10 GOs)  released

సీపీఎస్ ఉద్యోగులకు డబుల్ ఆప్షన్:

★ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) విధానంలో.. ప్రస్తుతం ప్రతి నెల ఉద్యోగుల వేతనాల నుంచి 10 శాతాన్ని పింఛను కోసం మినహాయించుకుంటూ, ప్రభుత్వం తన వాటా 10 శాతాన్ని కలిపి షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతూ, ఈ నిధులపై రాబడి ఆధారంగా పింఛను ఇస్తోంది. 


★ దీని ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు నెలకు రూ.800కు మించి పింఛను రావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబ పింఛను సౌకర్యం కల్పించాలంటూ వీరంతా చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం మన్నించింది. 


★ 2004 సెప్టెంబరు 1 తర్వాత నియమితులై.. సీపీఎ్‌సలో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పింఛను అమలు చేయాలని నిర్ణయించింది.


★ తాజా ఉత్తర్వుల ప్రకారం  సీపీఎస్‌ పింఛన్‌, ఫ్యామిలీ పింఛన్‌లలో ఏదైనా ఒకటి ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. 


★ కాగా, వీరు కుటుంబ పింఛను పొందాలంటే షేర్‌ మార్కెట్‌లో ఉద్యోగి తన వాటాగా, ప్రభుత్వ వాటాగా జమచేసిన నిధులన్నీ ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. 


★ నిధులు సమృద్ధిగా జమకావడం వల్ల ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ కన్నా ఎక్కువ మేలు కలుగనుంది. అయితే, పూర్తికాలం సర్వీసు చేసి చనిపోయినవారికి దీనిద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదు. 


★ తక్కువ కాలం సర్వీసు పూర్తి చేసుకుని చనిపోయే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.  సాధారణంగా.. పెన్షన్‌ను ఉద్యోగులు చనిపోతే 25 ఏళ్లలోపు వయసు కలిగిన కుమారుడు లేదా అవివాహితులైన అమ్మాయికి, ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులకు లభిస్తుంది.

విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/JCVuygcrA4l2V3FrkfdTBQ

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top