తీవ్ర అభియోగములపై విచారణ జరుగుచున్నప్పుడు లేక క్రిమినల్ అభియోగముపై దర్యాప్తు లేక కోర్టు విచారణ | జరుగుచున్నప్పుడు మాత్రమే ప్రజాహితం దృష్ట్యా ఒక ఉద్యోగిని సస్పెన్షన్లో వుంచవచ్చును. సస్పెషన్ ఉత్తర్వులు ఉద్యోగికి అందచేయబడిన తేదీ నుండి మాత్రమే అమలులోనికి వచ్చును. సస్పెన్షన్లో వున్న ఉద్యోగి తాత్కాలికంగా విధులు నిర్వహించని ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణించబడతాడు.
Suspension: తాత్కాలిక తొలగింపు:
1. ఒక టీచరుపై ఎటువంటి చర్య తీసుకోవాలన్నా మేనేజిమెంట్ ముందుగా విద్యాశాఖ అధికారులతో చర్చించాలి. వారి సలహాపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలి. (Memo No. 71149/H58-6, dt. 28-10-58).
2. మేజర్ పెనాల్టీలు రిమూవల్, డిస్మస్, క్యుములేటివ్ ఎఫెక్ట్ ఇంక్రిమెంట్ నిలుపుదల) వర్తింపదగు అభియోగాలున్న సందర్భములలో మాత్రమే నోటీస్ లేకుండా సస్పెండ్ చేయవచ్చును. అధికారులు ముందు షోకాజు నోటీస్ ఇచ్చి, కారణం తెలుసుకొని ఆ తదుపరి చర్యలు తీసుకోవాలి. నోటీస్ లేకుండా సస్పెండ్ చెయ్యడం తప్పు. Suspension is not to be lighty passed against the Government. సుప్రీం కోర్టు ఒ.పి. గుప్తా కేసులో వివరణ ఇచ్చింది.
3. సెన్పూర్ అంటే మందలించడం. దీని ఫలితంగా ఒక సంవత్సరము పైపోస్టు ప్రమోషన్ నిలిపివేయడం జరుగుతుంది. GO Ms. No. 53 G.A.D. dt. 4-2-97).
4. సస్పెన్షన్ కాలాన్ని Duty గా పరిగణిస్తే ఆకాలాన్ని ఇంక్రిమెంట్కు లెక్క వేస్తారు. Leave on loss of Pay గా పరిగణిస్తే ఆమేరకు ఇంక్రిమెంట్ ముందుకు పోతుంది. (Memo No. 11382/FR-II/64-1, dt. 16-6-64).
5.Without Cumulative Effect తో ఇంక్రిమెంట్ నిలిపి వేసిన (అనగా మైనర్ పెనాల్టీ) సందర్భాలలో ఆతరువాత ఇంక్రిమెంట్లపై
6.దాని ప్రభావం వుండదు. అంటే ఒక సంవత్సరము పాటు ఆర్థిక నష్టం జరుగుతుంది. FR-24. 2.
7.శిక్షలు రెండు రకాలు. (1) మేజర్ పెనాల్టీ, (2) మైనర్ పెనాల్టీ. Cumulative Effect లేకుండా ఇంక్రిమెంట్ తీసివేయడం మైనర్ పెనాల్టి క్రిందకు వస్తుంది. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసి విచారణ తర్వాత మైనర్ పెనాల్టీ విధించినప్పుడు సస్పెన్షన్" కాలాన్ని డ్యూటీగా పరిగణించి పూర్తి వేతనం చెల్లిస్తారు. (G.O.Ms.No. 238, GA.D. dt. 7-4-92. Ref. 182 F&P dt. 31-1-92).
8.క్రమ శిక్షణ చర్యలకు గురైన ఉద్యోగులను పదోన్నతికి సిఫార్సు చేయరు. (G.O. Ms. No. 430 G.A.D. (Ser-C) Dept., dt. 14-10-97).
9.క్రమ శిక్షణ కేసులు విచారణలో వున్న ఉద్యోగి రాజీనామా ఆమోదించరు. (G.O.Ms. No. 250, G.A.D. (Ser-D) Dept., dt. 14-7-2000).
10.జైలులో లేక బెయిలు పై వున్న, సస్పెండ్ అయిన ఉద్యోగికి సబ్జెన్స్ అలవెన్సు' మంజూరు చేస్తారు. (Memo No. 3907/471/A2/FR-11/99, dt. 28-2-2000).
11. సస్పెన్షన్ ద్వారా ఖాళీ అయిన పోస్టులలో కేవలం అడిషనల్ ఛార్జీ బాధ్యతలనే అప్పగించాలే గాని, బదిలీ, ప్రమోషన్ ద్వారా భరీ చేయరాదు.
(Memo No. 4308/219/FR/11/99 F7P dt. 23-5-2000).
0 comments:
Post a Comment