SR: How to Maintain Service Register/Book ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్/ సేవ పుస్తకం నిర్వహణ ఎలా ఉండాలి

Service Book- SR: How to Maintain Service Register/Book: Service book for Government Employees, Service Register of Government employee, Teachers Service Book entries

Service Register of Government employee  సర్వీసు రిజిష్టరు :

ఉద్యోగి నియామకము మొదలుకొని పదవీ విరమణానంతరం పెన్షన్ చెల్లింపు వరకు జరుగు మార్పులన్నీ S.R. లో నమోదు చేస్తారు. అందువల్ల ఉద్యోగి జీవితంలో సేవా పుస్తకమునకు ఎనలేని ప్రాధాన్యత వున్నది. F.R.-74 IV చెందిన అనుబంధం II లో తాలుకా 3 భాగం.

How to maintain leave account in service Book  Service Book pdf  E Service Register  Service book for Government Employees  Service Register of Government employee  Service Book after retirement  Teachers Service Book entries  Duplicate Service Book rules


SR: How to Maintain Service Register/Book ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్/ సేవ పుస్తకం నిర్వహణ ఎలా ఉండాలి


1. పుట్టిన సంవత్సరము మాత్రమే తెలిసి నెల మరియు తేది తెలియని సందర్భములో జూలై 1వ తేదీగా గుర్తించాలి.

 2. సంవత్సరము మరియు నెల' మాత్రమే తెలిసి, పుట్టిన తేది తెలియని పరిస్థితులలో సదరు నెల 16వ తేది గా గుర్తించాలి. 

3 ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఎడమచేతి బొటన వ్రేలు మరియు ఇతర వ్రేళ్ళ ముద్రలను లో కేటాయించబడిన స్థలంలో తీసుకోవాలి. ప్రత్యేక స్లిప్పులపై తీసుకొని అంటించరాదు.

4.S.R. లో అన్ని వివరాలు నమోదుపరచి, ధృవీకరించవలసిన బాధ్యత కార్యాలయ అధికారిపై వున్నది. సదరు సేవా పుస్తకములను సదరు అధికారి ఆధీనములో వుంచబడును.

5.ప్రతి సంవత్సరము మార్చి నెలలో ఉద్యోగి సేవా పుస్తకము కార్యాలయాధికారిచే పరిశీలన చేయబడి, ఎంట్రీలు సక్రమముగా నమోదు చేసినట్లు తృప్తిపడిన మీదట సర్వీసు వెరిఫికేషన్ ధృవీకరణను నమోదు చేస్తారు. Memo. No. 7527/2866/FR!! 643 ఆర్థికశాఖ, తేది 3-11-64.

6.ఉద్యోగుల సేవా పుస్తకములు upto date గా వున్నది లేనిదీ కార్యాలయధికారి/అధిపతి పర్యవేక్షించాలి. (Memo.No. 51830/ 2134 F.R.I.-64 ఆర్థికశాఖ తేది 9-11-64). G.O.Ms. No. 391 F.R.I. dt. 7-11-1977.

 7.ఉద్యోగికి తన S.R.ను చూచుకొనే హక్కు వుంది. ప్రతి సంవత్సరము కార్యాలయా ధికారి తన యాజమాన్యము క్రింద పనిచేయు ఉద్యోగులకు వారి సేవా పుస్తకము లను చూపించి వారు పరిశీలించినందులకు గుర్తుగా వారి సంతకములను పొందాలి. (F.R.Annexure || Part-III S.Rule 3).

8.ఉద్యోగి తన సంతకము చేయుటకు ముందు వివరములన్నియు నమోదు పరచినట్లు పరిశీలించుకొని ఆవిధముగా ధృవీకరించవలసి యున్నది.

9 సేవా పుస్తకము పోయిన సందర్భములో మరలా పునరుద్ధణకై నకలు సేవా పుస్తకమును ఉద్యోగి నిర్వహించుకొనవచ్చును. కార్యాలయాధికారి వద్ద నున్న మాత్రమే అధికారికముగా గుర్తించబడును. నకలు S.R. అనేది అసలు SR. & పునర్నిర్మాణమునకు మాత్రమే ఉపయోగపడును. G.O.Ms. No. 216, dt. 22-6-64.

10.సర్వీసు రిజిష్టరు పోగొట్టుకొనిన సందర్భములో Duplicate S.R. బట్టి పోయిన సర్వీస్ రిజిష్టరును ప్రిపేర్ చేయవచ్చును. uplicate S.R లేని సందర్భములో, పోలీస్ వారికి ఫిర్యాదు చేసి, దొరకు అవకాశము లేనట్లు వారి నుండి ధృవపత్రమ పొందాలి. రూ.5/-ల నాన్ జ్యుడిషియల్ స్టాంపుపై ఎఫిడవిట్ మేజిస్టేట్ సంతకముతో పొందాలి. మీ ఫలానా అ ప్రధానోపాధ్యాయుడు లేదా మండల పరిషత్ మేనేజిమెంట్ సర్టిఫై చేయాలి. పై సర్టిఫికెట్లతో బాటు క్రొత్త సర్వీసు రిజిష్టరు జతపరుస్తూ, తగు చర్యనిమిత్తము మేనేజిమెంట్కు దరఖాస్తు చేయాలి. వారు దానిని జిల్లా విద్యాశాఖాధికారి వారికి పంపుతారు. జిల్లా విద్యాశాఖాధికారి మొదటిపేజీ పూర్తిచేసి మేనేజిమెంట్కు పంపుతారు. జిల్లా విద్యాశాఖాధికారి మొదటి పే పూర్తిచేసి మేనేజిమెంటు పుంపుతారు. అక్విటెన్సు, పోస్టింగ్ రిజిష్టరు, ఇతర సంబంధిత రికార్డుల ననుసరించి SR. పునరుద్ధరించబడుతుంది.

 11.బదిలీ కాబడిన సందర్భములో బదిలీ స్వభావమును, కారణాలను తెలుపుచూ తగు ఎంట్రీలు బదిలీ తేదీ వరకు సర్వీస్ వెరిఫికేషన్ను S.R.లో ధృవకరించాలి. ఆ తర్వాత బదిలీ కాబడిన కార్యాలయాధికారికి పంపుతారు. ఆనాటి నుండి ఆ అధికారి బాధ్యత వహించును. గతంలో తప్పుగా నమోదు చేయబడిన, మినహాయించబడిన ఎంట్రీలు, విషయాలున్నవో సరిచేసి పంపుటకు గాను, S.R.ను పూర్వపు కార్యాలయాధికారికి త్రిప్పి పంపాలి.

 12.S.R. కారణాంతరాల వల్ల Head Office కు వెళ్ళినపుడు S.R. లేకున్నా వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయవచ్చును. అయితే సదరు ఉద్యోగిపై ఎటువంటి 'ఛార్జ్ పెండింగ్' వుండకూడదు. ఆ ఉద్యోగి ఆ సంవత్సరమునకు జీతపు నష్టపు సెలవు అనుభవించకూడదు. ఆమేరకు Certificate Proceedings ని జత చేయాలి. Roc No. 9514/565/G2/86-1, dt. 15-12-81. 8 

13.నూతనముగా సర్వీసులో చేరిన ఉపాధ్యాయులు మంచి కాంక్వెస్ట్ పేపరు గల సర్వీసు రిజిష్టరును S.R. ఒక బౌండుగా చేసుకొంటే సర్వీసు చివర వరకు ఉపయోగంగా వుంటుంది.

14.సేవా పుస్తకం మొదటి పేజీలో ఫోటో, ఎంప్లాయి కోడ్, లోకల్ స్టాటస్ వివరాలు విధిగా ఉండాలి.




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top