Service Regularisation and Probation Declaration Rules in AP సర్వీసు నిబంధనలు
Service Regularization Rules సర్వీసు రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్
ఒక తాత్కాలిక ఉద్యోగి యొక్క సేవలను క్రమబద్ధీకరణ' చేయుట అనగా సంబంధిత అధికారిచే నిబంధనల మేరకు ఉ జ్యోగిని రెగ్యులర్ నియామకము చేయుట. సదరు విధముగా క్రమబద్ధీకరణ చేయబడిన ఉద్యోగి సేవలను' ప్రొబేషన్' పై ఉ బడును. తాత్కాలికంగా నియమించబడిన ఉద్యోగి తన ప్రవర్తన ద్వారా సదరు పోస్టునందలి నియామకమునకు అర్హత, | సమర్థతలను ఋజువు పరచుకొను సేవాకాలమే 'ప్రొటేషన్ పీరియడ్' గా పిలువబడును. సాధారణ నియామకములలో మూడు సంవత్సరముల సేవాకాలములో రెండు సంవత్సరముల కాలము 'ప్రొబేషన్ పీరియడ్ ' గా పరిగణించబడును. క్రమ బద్ధీకరణ చేయబడిన తేదీ నుండి ప్రొటేషన్ పీరియడ్' ప్రారంభ మవుతుంది. పదోన్నతి (ప్రమోషన్) సందర్భములలో 2 సంవత్సరముల అవిచ్ఛిన్న సేవాకాలములో ఒక సంవత్సర కాలము 'ప్రొబేషన్' పీరియడ్గా లెక్కించబడును.
1. మొదటిసారిగా పొందిన నియామకము (First Appointment) వర్కింగ్ డే నాడు జరగాలి. 3 2.పంచాయితీరాజ్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రమోషన్లు, సర్వీసు రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లేర్ చేయుటకు జిల్లా విద్యాశాఖాధికారులకు (D.E.O.) అధికారం యిచ్చారు. GO. N. 538 విద్య, తేది 20-11-98, Rc. No. 2844/C2-1/99 తేది 3-8-2000
3.ఉపాధ్యాయుల 8,16,24 సంవత్సరముల ఫిక్సేషన్లు చేయుటకు అన్ని రకాల సెలవులు, ఇంక్రిమెంట్లు, సర్వీసు రిజిష్టరు మెయింటెయిన్ చేయు అధికారులు M.P.D.O.లనుండి M.E.O.లకు బదలాయింపు చేశారు. (ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ అధికారులు M.E.O. లకు లేవు)
4.మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేయుచున్న స్కూలు అసిస్టెంట్లకు సెలవు మంజూరు. సెలవు అనంతరము పోస్టింగ్ ఉత్తర్వులు M.E.O.లే యిస్తున్నారు. కనుక L.F.L. ప్రధానోపాధ్యాయులకు కూడా M.E.O.లే సదరు విషయాలపై ఉత్తర్వులు యిస్తారు (యాజమాన్యం మండల పరిషత్ అగుటవలన).
5.అటెస్టేషన్ ఫారాలు వెరిఫికేషన్ కొరకు పంపిన తర్వాత పోలీస్ డిపార్టుమెంట్ నుండి 15 రోజులు లోపల ఎటువంటి Ad verse Remarks రాకపోతే సదరు ఉద్యోగి సర్వీసును రెగ్యులరైజ్ చేయవచ్చును. Memo. No. 4583/G2/69-30. Edn. dt 20-5-74. కాని ఈ ఉత్తర్వులు అమలులో లేవు. పోలీసు వారి యాంటిసిడెట్స్ తప్పనిసరి.
6.సర్వీస్ సంతృప్తికరంగా ఉంటే రెండేళ్ళ సర్వీస్ పూర్తి చేస్తే ప్రొబేషన్ డిక్లేర్ చేయవచ్చును. ఏకారణం చేతనైనా ప్రొబేషన్కాలాన్ని మరొక సంవత్సరము పొడిగించ వచ్చును. 3 సంవత్సరముల సర్వీస్ పూర్తి అయిన వెంటనే తప్పని సరిగా ప్రొబేషన్డిక్లేర్ చేయబడినట్లు పరిగణించబడుతుంది. G.O. Ms. No. 278 విద్య. తేది 20-6-83 F.R. 24,
7.సెకండరీ గ్రేడు టీచరుగా రెగ్యులరైజ్, ప్రొబేషన్ డిక్లేర్ అయి. బి.యిడి. ప్రమోషన్ పొందితే అదే క్యాడర్లో ఒక సంవత్సరము సర్వీసు పూర్తి అయితే రెగ్యులరైజేషన్, ప్రొటేషన్ డిక్లేర్ చేస్తారు. Attestation Form లను పెటాల్సిన అవసరం లేదు. G.O.Ms. No. 1051 తేది 9-6-67.
8. ప్రొబేషన్ పీరియడ్లో జీతం నష్టంతో ఎంతకాలము. యింక్రిమెంట్ పోస్ట్ పోన్మెంట్ జరుగుతుంది. ఈ పోస్ట్ పోన్మెంట్ సర్వీసంతా కొనసాగుతుంది. అలాగే ఎంత కాలము అర్హతగల సెలవు (సంపాదిత, అర్థజీతపు, జీతపు నష్టపు సెలవు పెట్టుకుంటే అంతకాలము ప్రొటేషన్ పిరియడ్ కూడా పొడిగించబడుతుంది. దాని ప్రభావం 8,16,24 సంవత్సరముల స్కేళ్ళ ఇంక్రిమెంట్లపై కూడా కన్పిస్తుంది. (ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కానివారికి మాత్రమే).
9. అప్రెంటీస్ టీచర్లు కూడా యాంటిసిడెంట్స్ ఫారాలను సర్వీస్ రెగ్యులరైజేషన్ కొరకు సంబంధిత అధికారులకు పంపుకోవాలి.. | బై ప్రొబేషన్ డిక్లరేషన్ జరగని ఉద్యోగి తాత్కాలిక ఉద్యోగిగా పరిగణించబడతారు. కనుక శాశ్వత ఉద్యోగిగా పరిగణించబడుటకు "ప్రొబేషన్ డిక్లరేషన్" అవసరం.
10.ప్రతి ఉద్యోగి తన సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొటేషన్ డిక్లరేషన్ విధిగా పొందాలి. లేనిచో అతడు పర్మినెంట్ ఉద్యోగిగా పరిగణించబడు అవకాశం లేదు. అంతేగాక సీనియారిటీ లిల్లీలో పేరు నమోదు చేయబడక ప్రమోషన్, ప్రీ పోస్మెంట్ మొదలగు సౌకర్యాలకు అర్హత పొందలేదు.
11.ఉద్యోగి సర్వీస్ లో చేరిన తేది నుండి మూడేళ్ళలో రెండేండ్లు ప్రొటేషనరుగా ఉంటాడు మూడేండ్లు దాటిపోతే పోలీసు రిపోర్టులు రాకపోయినా అభ్యంతరకరమైన రిపోర్టులు లేవని ధృవపరచుకొని నియామకాలు క్రమబద్ధీకరణ చేయాలి. (GO.Ms. No. 742, dt. 10-8-79).ప్రొబేషనర్' గా ప్రకటించాలి.
12.ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన ఉపాధ్యాయుడు మాత్రమే సర్వీస్ కమీషను సెలక్షన్ ద్వారా (Group-II Post) లకు ఎంపికైనపుడు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఆ సర్వీసు దేనికి పరగణించబడదు. ప్రభుత్వంలో ఒకే కేడర్లో పనిచేసే వారు ప్రొబేషన్ డిక్లేర్ కాగానే ఆ Post పై హక్కు ఏర్పడుతుంది. మరొక Post కు ఎంపికైనపుడు పాత పై హక్కు ఉంచుకుంటూ లీవ్ పై రిలీవై క్రొత్త Post లో చేరవచ్చును. 3 సంవత్సరములలో క్రొత్త పోస్టులో 'పొటేషన్ డిక్లరేషన్ పొందాలి. లేదా తిరిగి వచ్చి పాత పోస్టులో చేరవచ్చు. లేనిచో 3 సంవత్సరములు దాటగానే వారు రాజీనామా చేసినట్లు భావించి పాత పోస్టుపై హక్కు కోల్పోతారు. (A.P. Subordinate Service Rules Rule 39).
13.రెగ్యులరైజేషన్ అనగా తాత్కాలికముగా ఉద్యోగిని నిబంధనల మేరకు సంబంధిత అధికారి రెగ్యులర్ ఖాళీ పోస్టులో నియామకమును ధృవీకరించుట.
(Memo No. 1596/82/705/Edn., dt.2-71)
14. ప్రొబేషన్ పొందిన తదనంతరం సర్వీసులో జీతం నష్టం సెలవు ఎంతకాలం పెట్టుకుంటే అంతకాలము ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది. అలాకాక ఆరు నెలల వరకు మాత్రమే వైద్య కారణములపై అర్హత గల సెలవు పెట్టినపుడు ఇంక్రిమెంట్ వాయిదాపడదు.
15.ప్రొబేషన్ పీరియడ్కు లెక్కింపబడు సర్వీసు మాత్రమే సీనియారిటీని నిర్ణయి స్తుంది. (స్పెషల్ టీచర్ సర్వీసు ప్రొబేషకు లెక్కించ బడదు)
16. క్రమబద్ధీకరణకు మొదటి నియామకపు తేదీని మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. (D.S.E.,L.M.S. No. 3353-C2.175, dt 3-9-78).
17. నియామకపు అధికారాలు గల వారే నియామకమును క్రమ బద్ధం చేస్తారు.(Govt. Memo No. 1596/G2/70-5. Edn, dt. 12-2-71).
Regularisation Benefits క్రమబద్ధీకరణ ఉపయోగాలు :
1.క్రమబద్ధీకరణ ఆధారముగా జ్యేష్ఠత (సీనియారిటీ) నిర్ణయించబడును.
2. రెగ్యులరైజేషన్ జరుగని ఉద్యోగి తాను పొందిన సంపాదిత సెలవులో సగము మాత్రమే సెలవు. ఖాతాకు జమ పొందడం. జరుగుతుంది. మిగతా సగభాగము సంపాదిత సెలవు రెగ్యులరైజేషన్ జరిగిన తర్వాత మాత్రమే సెలవు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది.
3.క్రమబద్ధీకరణ పొందని వారు ప్రస్తుత నిబంధనల మేరకు అర్ధబీతపు సెలవు, కమ్యుటెడ్ సెలవునకు అర్హులు కారు.
4.రెగ్యులరైజ్ కాని వారి సంపాదిత సెలవు ఒకేదఫా 3 రోజులకు మించి మంజూరు చేయబడదు.
5. క్రమబద్ధీకరణ కాని వారి అసాధారణ సెలవు 3 మాసాలకు మించి మంజూరు చేయబడదు.
6.3 సంవత్సరముల కంటిన్యూ సర్వీస్ కలిగిన సందర్భములో వైద్య ధృవపత్రముపై ఆరు మాసములకు మించి అసాధారణ సెలవు మంజూరు చేయబడదు.
7 పదోన్నతి పొందుటకు క్రింది పోస్టులో రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ పొందవలసి వున్నది.
8. ఇంక్రిమెంట్ల మంజూరు సందర్భములో కూడా రెగ్యులరైజేషన్ ప్రాధాన్యత వహించినప్పటికి అనేక సందర్భాలలో ఈ నియమమునకు మినహాయింపు పొందడం జరిగింది.
9. ప్రీపోన్మెంట్ పొందవలసిన పరిస్థితులలో రెగ్యులరైజేషన్ ఆధారంగా నిర్ణయించబడిన జ్యేష్ఠతయే ప్రాధాన్యత వహిస్తుంది.
Probation declaration Benefits ప్రొబేషన్ ఉపయోగాలు:
1. తాను నియమించబడిన శ్రేణిలో అతని 'ప్రొబేషన్' పీరియడ్ సంతృప్తికరంగా పూర్తి చేయని ఏ వ్యక్తి అయిననూ పదోన్నతి (ప్రమోషన్)కి అర్హుడు కాదు.
2.ప్రత్యక్ష నియామకం ద్వారా నియమించుటకు వీలు లేని ఒక ఖాళీలో ప్రొబేషన్ లేక ఆమోదిత ప్రొబేషన్ ఉండగా, ప్రొబేషన్ ప్రారంభించని వ్యక్తిని నియమించు టకు వీలులేదు.
3. ప్రొబేషన్ మంజూరు కాబడిన ఉద్యోగికి 'సెలవు నిబంధనలు' ప్రకారం అన్ని విధాలైన సెలవులకు పూర్తి హక్కు లభించును.
4. ప్రత్యేక ఉత్తర్వులు లేని సందర్భములో రెగ్యురల్ ఇంక్రిమెంట్లు పొందుటకు ప్రొబేషన్ మంజూరు కావల్సి ఉంటుంది.
5. ఉద్యోగి యొక్క స్థిరీకరణ' ప్రొబేషన్ మంజూరీ తదుపరి మాత్రమే జరుగును.
6. ప్రొబేషన్ సంతృప్తికరముగా పూర్తి చేసినట్లు ప్రకటించని సందర్భములో శాశ్వత ఉద్యోగి అయినచో ప్రొబేషన్ 'టెర్మీనెట్' చేసి క్రింది పోస్టునకు రివర్టు చేయబడుట లేదా సర్వీసు నుండి తొలగించ బడవచ్చును.
0 comments:
Post a Comment