👉🏻 రీగ్రూపింగ్ పే స్కేల్లలో సీనియర్ మరియు జూనియర్ మూలవేతనములు నిర్ణయించబడి సీనియర్ ఇంక్రిమెంటు తేదీకన్న జూనియర్ ఇంక్రిమెంటు తేది ముందున్నచో సీనియర్ ఇంక్రిమెంటు తేది మార్చబడును.
(G.O.Ms.No.14 DL. 13-1-1988)
పై సౌకర్యము ఒకే క్యాడరులో నియామకమయిన ఇద్దరు ఉపాధ్యాయులలో వ్యత్యాసమున్నపుడు వర్తించును.
సీనియర్ జూనియర్ కన్న అన్ని విధాలుగా అనగా నియామకములో, విద్యార్హతలలో పదోన్నతులలో సీనియర్ అయి ఉండాలి
1974, 1978, 1986, 1993 పేస్కీలలో మరియు 8/16 సంవత్సరములకిచ్చు పదోన్నతులలో వేతనము నిర్ణయించబడినపుడు కూడ సీనియర్ కన్న ముందు జూనియర్ వార్షిక హెచ్చింపు తేది ఉండుటచే జూనియర్ అధిక వేతన పొందుచున్న యెడల సీనియర్ ఇంక్రిమెంటు తేదిని జూనియర్ ఇంక్రిమెంటు తేదిని జూనియర్ ఇంక్రిమెంటు తేదికి మార్చుటకు అవకాశము కల్పించబడినది. కాని ఈ సౌకర్యము 1999 పే స్కేల్లలో కల్పించలేదు.
పై సౌకర్యము కలుగజేస్తూ ఇచ్చిన ఉత్తర్వులలో అద్దరి ఉపాధ్యాయుల వివరములు స్పష్టముగా పొందుపరచాలి.బిల్లు వెంబడి ఇద్దరు సర్వీసు పుస్తకముల ప్రతులు జత చేయాలి. జిల్లా విద్యాధికారి గారిచే జారీ చేయబడిన సీనియారిటి పట్టికను జతచేయాలి.
RPS 2010 యందు ఈ సౌకర్యము తిరిగి పునరుద్ధరించబడినది. (GO.Ms.No.52, Fin (PC.I) Dept. Dt.25-2-10 లోని పేరా 7)
ఉదాహరణ :
జూనియర్ : 2002 ద్వారా నియామకం పొందిన ఒక SGT అక్టోబర్ 2004లో రెగ్యులర్ స్కేలు వేతనం రూ. 5,470 పొందియున్నాడు. RPS 2010లో అతని వేతనం రూ. 10,000/- లుగా నిర్ణయించబడింది. తదుపరి ఇంక్రీమెంటు తేది : 1-10-2008 నాటికి వేతనం రూ. 11,200/-లుగా వృద్ధి చెందుతుంది.
సీనియర్ : 2001 డి.యస్పీ. ద్వారా నియామకం పొందిన ఒక యస్.జి.టి. ఉపాధ్యాయుడు జనవరి 2002లో సర్వీసులో చేరి అనంతరం జనవతి 2004లో వేతనం రూ. 5,470గా నిర్ణయించ బడుతుంది. వీరికి RPS 2010లో తేది 1-7-2008 నాడు వేతనం రూ. 10,900 గాను, తదుపరి ఇంక్రీమెంట్ తేది జనవరి 2009న రూ. 11,200/- గానూ నిర్ణయించబడుతుంది.
పై ఉదాహరణలో సీనియర్ ఆయిన ఉపాధ్యాయులు జూనియర్ ఉపాధ్యాయుని కంటే 3 నెలలు ఆలస్యంగా ఇంక్రిమెంట్ పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రీఫోన్ మెంట్ ఉత్తర్వుల మేరకు నీనియర్ ఉపాధ్యాయుని ఇంక్రీమెంట్ తేది జనవరి నుండి జానియర్ ఉపాధ్యాయుని ఇంక్రిమెంట్ తేది అక్టోబర్ కి ప్రీఫోన్ చేయబడుతుంది.
పై సౌకర్యము కలుగజేయు అధికారము వేతన నిర్ణయము చేయు అధికారికి( DDO ) గలదు.
స్టెప్ అప్, ప్రీఫోన్ మెంట్ కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు:
1.G.O.Ms.No. 297, Fin, dt : 25-10-1993
2.G.O.Ms.No. 52, Fin, dt : 25-2-2010
3.G.O.Ms. No. 93, Fin, dt : 3-4-2010
4.G.O.Ms.No. 96, Fin, dt : 20-5-2011
https://t.me/APEMPLOYEES
5.Memo No. 33327.A /549 / A1 / PC-I/2009, dt : 13-3-2010.
6.Memo No. 5465/ 48 / A2 / PC.I/ 2011
7.Memo No. 12254 / 133/ PC-I/ 2010, dt : 30-8-2010.
0 comments:
Post a Comment