NPS: జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్)లో త్వరలో మార్పులు

 ఎన్‌పీఎస్ లో  మార్పులు.


★ జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్)లో త్వరలో మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం... ఈ దిశగా పరిశీలన జరుగుతోంది. 


★ ఈ క్రమంలో... పెన్షన్ డబ్బు మొత్తాన్ని ఒకే దఫాలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగులకు ఇది ఉపశమనం కావచ్చని భావిస్తున్నారు.  


★ ఈ క్రమంలో... జాతీయ పెన్షన్ విధానంలో మార్పులు చేయాల్సిన విషయమై పరిశీలన జరుగుతోంది. ఎన్‌పిఎస్‌ను మరింత వెసులుబాటు కలిగించే దిశగా ఈ మార్పులు చేస్తున్నారు. 


★ ఎన్‌పిఎస్‌లో పలు మార్పులు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చైర్మన్ సుప్రతీం బందోపాధ్యాయ వెల్లడించారు. 


★ ఎన్‌పీఎస్‌లో మార్పులు జరిగినపక్షంలో పెట్టుబడిదారులు ఇప్పుడు తమ మొత్తం నిధిని క్రమంబద్ధ ఉపసంహరణ ప్రణాళిక(ఎస్‌డబ్ల్యుపీ) లో ఉంచగలుగుతారు. ఇది వారి లాభాలను పెంచుతుంది. 


★ ప్రస్తుతం, పెట్టుబడిదారులు తమ పదవీవిరమణ సమయంలో వారి కార్పస్‌లో 60 % మాత్రమే ఉపసంహరించుకోగలుగుతారు.


★ మిగిలిన మొత్తాన్ని యాన్యుటీని కొనడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత... ఆ డబ్బు మీద, వారు జీవితాంతం ఆదాయాన్ని పొందుతూ ఉంటారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top