Meternity Leaves ప్రసూతి సెలవు నిబంధనలు

Maternity leave rules AP Govt Employees ఉద్యోగం చేసే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రత్యేకమైన రాయితీలను, అవకాశాలను కల్పించింది. వారికి గృహ సంబంధం బాధ్యతల నిర్వహణకు అదనంగా, శరీర నిర్మాణపరంగా తలెత్తే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా ఉండవచ్చు. వీటిని దృష్టికి ఉంచుకొని ప్రభుత్వం కల్పించిన సదుపాయాలలో ముఖ్యమైనది ప్రసూతి సెలవు.

Meternity Leaves ప్రసూతి సెలవు నిబంధనలు


Meternity Leaves ప్రసూతి సెలవు నిబంధనలు:

1. ప్రసూతి సెలవు 180 రోజుల వరకు లభిస్తుంది. అయితే ఇద్దరు లేదా అంతకన్నా తక్కువ సంఖ్యలో జీవించి ఉన్న పిల్లలు ఉన్నవారికే ఈ సదుపాయం పరిమితం. (G.O.Ms. No.152 Fin & Plg. (Fin Wing FR-I) Dept. dt. 4-5-2010 మిస్ క్యారేజ్ | అబార్షన్కు 6 వారాల సెలవు లభిస్తుంది. (G.O.Ms.No.152 Fin & Plg Dept. dt. 4-5-2010)

2.ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించే వైద్య ధృవపత్రంలో తప్పనిసరిగా అది ఎన్నో కాన్పో స్పష్టంగా పేర్కొని తీరాలి. కాన్పు సంఖ్య ఏదైనా, ఈ కాన్పులో ప్రసవించిన బిడ్డతో కలిపి, ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారని వైద్య ధృవపత్రంలో ఉండి తీరాలి. కాన్పు అయిన తేదిని తెలపాలి. ఈ సెలవు కాన్పు అయిన తేది నుండి ప్రసూతి సెలవు మంజూరుకు అవకాశం

3.వైద్య ధృవపత్రంలో ఉంది. ఈ సెలవు 6 నెలలు మంజూరి చేయవలసిన వచ్చుచున్నందున ఈ సెలవును ఉప విద్యాధికారిగారు మంజూరి చేస్తారు. 

4.మంజూరైన ప్రసూతి సెలవు మొత్తం 180 రోజులకు పూర్తి జీతం లభిస్తుంది. సెలవు మంజూరు చేయించుకున్న పక్షంలో ప్రసూతిసెలవు తీసుకున్న ఉద్యోగానికి ప్రతి నెలా జీతం పొందే హక్కు ఉంది.

5.ఏ కారణం వల్లనైనా 180 రోజులకు మించి సెలవు కావలసిన పక్షంలో 180 రోజులకు ప్రసూతి సెలవు పోగా, మిగిలిన రోజులకు తమకు అర్హత ఉన్న లీవు మంజూరు చేయించుకోవచ్చు.

6.ప్రసూతి సెలవును ఆ ఉద్యోగి లీవ్భతాలో మినహాయించనవసరం లేదు. (Maternity Leave not debitable to Leave Account) * విద్యా సంవత్సరం పనిదినాలలో ప్రసూతి సెలవు తీసుకునేటట్లు అయితే పూర్తి సెలవు దినాలలో ప్రసూతి సెలవుగానే పరిగణిస్తారు. * వెకేషన్లో ప్రసూతి అయినచో ప్రసూతి అయిన తేది నుండి 180 రోజుల మెటర్నిటి సెలవు మంజూరి చేయాలి. (G.O.Ms.No. 562 Dt 23-6-1981)

7.ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు పదోన్నతి లభిస్తే ప్రసూతి సెలవులు పూర్తయిన తరువాత విధులలో చేరవచ్చును. అలాగే బదిలీ అయినను కూడా ప్రసూతి సెలవు పూర్తయిన తరువాత విధులలో చేరాలి. (C & DSE Procs. No. 29/C3-4/2003 dt. 25-1-2003) * సజీవంగా ఉన్న బిడ్డలు ఇద్దరు ఉన్నపక్షంలో, ఉద్యోగినికి ఆ తరువాత ప్రసూతి సెలవు, మిస్ క్యారేజి / అబార్షన్ పై సెలవు ఆ లభించదు. ప్రసూతి సెలవు అనేది ఇద్దరు సజీవంగా ఉన్న బిడ్డల వరకే లభిస్తుంది. (G.O.Ms.No. 152 dt. 4-5-2010)


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top