జిల్లాలోని అందరు ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (ప్రపేట్ యాజమాన్యము మినహా) తెలియజేయడం ఏమనగా ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలు మ్యాపింగ్ చేయునపుడు గమనించ వలసిన విషయాలు :
Mapping of UP/High Schools to Primary Schools( Radius 3 KM) సూచనలు:
1) ప్రైవేట్ యాజమాన్యము మినహా అన్ని యాజమాన్యాలలను ప్రామాణికంగా తీసికొనవలయును.
2) 3.00 కి.మీ. పరిధిలో ఉన్న జూనియర్ కళాశాలలను కూడా చూపింగ్ లో చేర్చవలెను.
3) ఒకే యాజమాన్యం లో ఉన్న పాఠశాలలను అదే యాజమాన్యం లో ఉన్న పాఠశాలలతో మాత్రమే మాపింగ్ చేయవలెను . ఉదా : జిల్లా పరిషత్ పాఠశాలలకు MPP పాఠశాలలను మాత్రమే మాప్ చేయాలి Governament పాఠశాలలను మాప్ చేయకూడదు.
4) మీడియంతో సంబంధం లేకుండా ఏ మీడియం అయినా మ్యాపింగ్ చేయవచ్చును.
5) మ్యాపింగ్ చేయునప్పుడు తప్పనిసరిగా సదరు CRP సహాయము తీసుకోనవలయును.
6) ఉప విద్యాశాఖాదికారులు/మండల విద్యాశాఖాధికారులు తమ పరిధి లోని పాఠశాలలను పర్యవేక్షించవలయును. ఈ కార్యక్రమము రేపు సాయంత్రము లోపుల పుర్తిచేయునట్లు చూడవలయును.
0 comments:
Post a Comment