ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ – విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) వివిధ విభాగాల్లో ఖాళీలు వున్నాయి. కనుక ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
దీనిలో మొత్తం 53 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మేనేజర్, ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో, శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. జనరల్ మేనేజర్ 1, అడిషనల్ జనరల్ మేనేజర్ 1, డీజీఎం 3, సీనియర్ మేనేజర్ 4, మేనేజర్ 8, డిప్యూటీ మేనేజర్ 1 (శాశ్వత ప్రాతిపదికన) భర్తీ చేస్తారు.అదే విధంగా డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ 2, ప్రాజెక్ట్ మేనేజర్ 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ 28 (ఎఫ్‌టీసీ), సీనియర్ కన్సల్టెంట్ 3, కన్సల్టెంట్ 1 పోస్టులను ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలని https://www.hslvizag.in/ వెబ్‌సైట్ లో చూడొచ్చు.
ఇక అర్హత విషయం లోకి వచ్చేస్తే.. ఏదైనా విభాగంలో ఫుల్ టైమ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటుగా నిర్దిష్ట అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
శాశ్వత పోస్టులకు జూలై 20 లోగా అప్లై చేసుకోవాలి. ఎఫ్‌టీసీ పోస్టులకు ఆగస్టు 10 లోగా అప్లై చేసుకోవాలి. కాంట్రాక్ట్ పోస్టులకు ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.hslvizag.in/
0 comments:
Post a Comment