Examination Updates: పది, ఇంటర్ పరీక్షలు

★ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చక్కబడ్డాకే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 


★ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. 


★ విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. 


★ ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయని.. అలాగని ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఏముందన్నారు.


★ అలాగైతే ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా?అని మంత్రి ప్రశ్నించారు. 


★ రాష్ట్రంలో కరోనా ఉద్దృతి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top