కేవలం ఇంక్రిమెంట్, ప్రమోషన్, వేతన సంఘ నివేదిక అమలులో మాత్రమే జీతంలో పెరుగుదల.
CPI(Consumer Price Index ) నివేదిక ప్రకారం మార్కెట్ ధరలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం కరవు భత్యం ప్రకటిస్తుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి. ఇది కేవలం ప్రభుత్వోద్యోగులకు మాత్రమే కాకుండా పనికి ఆహార పథకంలో పాల్గొనే కూలీలకు కూడా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు దీనిపై (DAపై) ఉద్యోగుల నుండి ముక్కుపిండి ఆదాయపు పన్ను కూడా వసూలు చేస్తారు. అందుకే ఉద్యోగుల జీతం పరిమాణం పెరుగుతుంది కాని జీతం విలువ పెరగదు.
ఉదాహరణకు 1995లో రూ 5000/- జీతం తీసుకుంటే ఆ రోజు బయట భోజనం ఖరీదు 10 రూపాయలు.
నేడు రూ 60,000/- తీసుకుంటే బయట భోజనం రూ 100/-. "టీ "నాడు అర్ధరూపాయి; నేడు పది రూపాయలు.
అందుకే DA పెరుగుదలను జీతం పెరుగుదలగా పరిగణించగూడదు. ఈ DA ఆధారంగానే రైతులకు కనీస మద్దతు ధరలు(MSP) ప్రకటిస్తారు. దాని ఆధారంగా మార్కెట్లో వస్తువులు, లేబరు ఛార్జీలు ప్రియం అయిపోతాయి. అందుకే చట్టబద్ధంగా రావాల్సిన DA పెరుగుదలను న్యాయస్థానాలు కూడా సమర్ధిస్తాయి.
బయట మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉంటే DA పెంచకపోయినా ప్రభుత్వోద్యోగికి వచ్చే నష్టమేమీ ఉండదు. ఇప్పుడు చూడండి కూరగాయలు, కరెంటు, పెట్రోల్ ....వగైరా అమాంతం పెరిగిపోయిన తరువాత DA కూడా వాటికి అనుగుణంగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది
0 comments:
Post a Comment