Covid 19; దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

 కొత్త మార్గదర్శకాలు


★ దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల.


★ అండర్‌ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులంతా... అన్ని రోజులూ పూర్తిగా కార్యాలయాలకు హాజరు కావాలని పేర్కొంది. 


★ దివ్యాంగులు, గర్భిణులకు మాత్రం... ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును కొనసాగిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు.


★ అండర్‌ సెక్రటరీ కంటే తక్కువ స్థాయి సిబ్బందిలో 50శాతం మంది రోజూ కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మిగిలిన వారు ఇంటి నుంచి పని చేస్తారు. 


★ కొంతమంది ఉదయం 9 నుంచి 5.30 దాకా; 

★ మరికొంతమంది 9.30 నుంచి 6 గంటలదాకా; 

★ ఇంకొంతమంది ఉదయం 10 నుంచి 6.30 దాకా పనిచేస్తారు.


★ కంటెయిన్‌మెంట్‌ జోన్ల నుంచి వచ్చే సిబ్బంది, ఆ జోన్లను ఎత్తేసే దాకా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు.  


★ ఈ ఆదేశాలు ఈనెల 16 నుంచి 30వ తేదీ దాకా అమలులో ఉంటాయి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top