కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా టెన్షన్లు తప్పట్లేదు. మాట్లాడితే థర్డ్ వేవ్ అంటూ హడావుడి నడుస్తోంది. మరి వేసుకున్న వ్యాక్సిన్ ఎంతకాలం రక్షిస్తుందో కచ్చితమైన వివరాలతో తెలుసుకుందాం.
ఇండియాలో రోజూ లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటికే 21.85 కోట్ల మంది వేయించుకున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోస్ వేసుకున్నవారు... రెండో డోస్‌ను 12 వారాల తర్వాత 16 వారాల లోపు వేసుకోవచ్చని తెలిపింది. అలాగే... కోవాగ్జిన్‌ను 4 వారాల తర్వాత 6 వారాల లోపు వేసుకోమంది. ఇక స్పుత్నిక్ వి రెండో డోస్‌ను 21 రోజుల తర్వాత నుంచి 90 రోజుల లోపు వేసుకోమంది. జనరల్‌గా ఎవరైనా ఒక డోస్ వేసుకుంటే... చాలా వరకూ రక్షణ లభించినట్లే. ఐతే... ఈ రక్షణ ఎంత కాలం ఉంటుంది? తెలుసుకుందాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని డాక్టర్ క్యాథెరిన్ ఓబ్రియన్ ప్రకారం... మొదటి డోస్ వేసుకున్న 2 వారాల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ రెండో డోస్ వేసుకున్న తర్వాతే... ఇమ్యూనిటీలో చురుకుదనం వస్తుంది. రెండో డోస్ తర్వాత ఇమ్యూనిటీ పవర్ (వ్యాధి నిరోధక శక్తి) మరింత పెరుగుతుంది.
సైంటిస్టుల ప్రకారం... 2 డోసులూ వేసుకున్న తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఎంతకాలం ఉంటుందో స్పష్టత లేదు. డాక్టర్ క్యాథరిన్ ఏమన్నారంటే... "మేం రెండు డోసులూ వేసుకున్న వారిని గమనిస్తున్నాం. వారిలో యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో, టీ సెల్స్ స్పందన వంటివి పరిశీలిస్తున్నాం. అది తెలియాలంటే కొంత టైమ్ పడుతుంది" అన్నారు.
"అమెరికాకు చెందిన ఫైజర్ (Pfizer) వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే... దాదాపు 6 నెలలు, అంతకంటే ఎక్కువ కాలమే ఇమ్యూనిటీ ఉంటోంది. అలాగే అమెరికాకు చెందిన మోడెర్నా (Moderna) వ్యాక్సిన్... రెండో డోస్ వేశాక... 6 నెలలపాటూ... యాంటీబాడీలు ఉంటున్నాయి. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ సంవత్సరం లేదా అంత కంటే ఎక్కువే ఉండొచ్చు. కచ్చితంగా చెప్పలేం. కాకపోతే... కోవిషీల్డ్ అనేది... ఆక్స్‌ఫర్డ్ వారి టెక్నాలజీతో తయారైంది కాబట్టి... ఇదివరకు వారి వ్యాక్సిన్లు సంవత్సరం అంత కంటే ఎక్కువ కాలమే ఇమ్యూనిటీ కలిగి ఉన్నాయి" అని ఆమె తెలిపారు
మరి కొత్తగా వస్తున్న వేరియంట్లను ఈ వ్యాక్సిన్లు అడ్డుకోగలవా అన్న ప్రశ్నకు సైంటిస్టులు ఏం చెప్పారంటే... "ఇండియాలో B.1.617.1, B.1.617.2 వేరియంట్లు వచ్చాయి. మూడో డోస్ కూడా అవసరం" అంటున్నారు.
కోవాగ్జిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ కూడా బూస్టర్ డోస్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ బూస్టర్ డోస్ అనేదాన్ని... రెండో డోస్ తీసుకున్న 6 నెలల తర్వాత ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్య రెండో డోస్ తీసుకున్న వారికి ఇప్పుడు బూస్టర్ డోస్ ఇస్తున్నారు.
న్యూయార్క్ టైమ్స్... రెండు అధ్యయనాలపై ఓ వివరణ ఇచ్చింది. ఇమ్యూనిటీ పవర్ ఏడాది లేదా... అంతకంటే... ఎక్కువగా అంటే... జీవిత కాలం ఉండగలదని చెప్పింది. అదే నిజమైతే... రెండుసార్లు డోసులు తీసుకున్నవారు... ఇక బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన పనిలేదు.
వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నా... కరోనా సోకదు అనేందుకు గ్యారెంటీ లేదు. అందువల్ల అందరూ మాస్కులు వాడాలనీ, సేఫ్ డిస్టాన్స్ పాటించాలని ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.
0 comments:
Post a Comment