APNGO: సీ ఏం జగన్ గారిని కలిసి సమస్యలు పై విజ్ఞప్తి చేసిన ఏపి ఎన్జీవో నాయకులు - PRC అమలుకు సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి

ఎ.పి.ఎస్.జి.ఓ.స్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏ.పి.జె.ఏ.సి చైర్మన్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కలిసిన ఎ.పి.ఎస్.జీ.ఓ.స్ రాష్ట్ర కార్యవర్గం ,విజయవాడ, తది: 16-06-2021 సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు.ఎ.పి.ఎస్.జీ.ఓ.ఏ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏ.పి.ఐ.ఏ.సీ చైర్మన్ శ్రీ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఎ.పి.ఎస్. జీ.ఓ ఎస్ రాష్ట్ర కార్యవర్గ నాయకులు రాష్ట్ర ముఖ్య మంచి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో 16-05-2021 తేదీన కలపడం జరిగింది.



1. ఈ సందర్భం లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలిసిన రాయితీలు వారు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి వాటికి సంభందించిన వినతి పత్రం అందించడం జరిగింది,

2. 11వ ఏ.ఆర్.సి. వివేదకను కమిషన్ గారు ప్రభుత్వానికి తేది 05-10-2020 న సమర్పించినందున కాలాతీతం లేకుండా ఉద్యోగ సంఘ నాయకులతో వెంటనే చర్చించి జూలై 1, 2018 నుండి 55% ఫిట్ మెంట్ తో పి.ఆర్.సి, ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి గారు త్వరలో అమలు చేస్తామని సానుకూలంగా స్పందిచాడు.

3. 01-07-2018 నుండి చెల్లించవలసిన కరువు భత్యం (డి.ఏ) బకాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

4. సి.పి.ఎస్. పై మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టక్కర్ గారి నివేదకపై ఏర్పాటు అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదిక తరుణమే ఫిర్ణయాలు తీసుకొని సి.పి.ఎస్. ను రట్టు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోనికి తీసుకొని రావాలని కోరారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదికను పరిశీలించి ఉద్యోగులు నాయకులతో చర్చించి త్వరలో ఉద్యోగులకు తగున్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

5. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదకను పరిశీలించి కాంట్రాక్టు ఉద్యోగులను అందరిని వెంటనే క్రమబద్ధీకరించ వలే గని కోరారు. అలాగే అరోనా వలస ప్రాణాలు కోల్పోయిన కాంటాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని, అట్టి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. త్వరలోని ఉద్యోగ మరియు ఉపాధ్యాయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు

6. 4వ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మిగిలిన ఉద్యోగులకు పెంచిన విధంగా 2 సంవత్సరాలు పొడిగిస్తూ పదవివిరమణ వయస్సును 60 సంవత్సరాలు నుండి 62 సంవత్సరాలు వరకు పెంచాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిచారు.

7. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఒక చోట 9 సంవత్సరాలు పనిచేయు వచ్చనేనిబందనను పునరిద్ధరించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి గారు గతంలోనే అంగీకరించినప్పటికీ అంతవరకి ఉత్తరువులు రాలేదని తెలియచేసారు. త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు.

8. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరికి వారు పనిచేసే ప్రాంతాలలో ఇంటి స్థలాలను మంజూరు చేయాలనీ కోరడం జరిగినది.దీనికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు.

9. కోవిడ్ సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజులు స్పెషల్ క్యాజువాల్ లీవ్ ను మంజూరు చేయాలని, అలాగే కోవిడి విధులు నిర్వహిస్తూ మరణించిన అన్ని శాఖల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం తో పాటు కుటుంబంలో అర్హులు అయిన వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని, పెన్షన్ వగైరా ఆర్ధిక వసతులను వెంటనే చెల్లించాలని కోరడమైనది. దీనికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిచారు.

10. కమర్పయర్ బాక్స్ శాఖలో పనిచేసే ఆసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ / గూడ్స్ & సర్వీస్ టాక్స్ ఆఫీసర్ కు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు.

11. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనదీ టెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని మరియు ఉద్యోగస్తులు కోరిన వెంటనే .పి.ఎఫ్. అద్వాన్సు, ఏ.పి.జి.ఎల్.ఐ లోను తదితర బిల్లులను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవల్సినదిగా కోరడమైనది.

12. రాష్ట్రంలో వివిధ శాఖలను సరిగా ఉన్నా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసారు.

13. 2008 క్వాలిఫైడ్ డి.ఎస్.సి ఉపాద్యాయలకు ఇచ్చిన ఉగురువ్వులు మాదిరిగా, 1998 డి.ఎస్.సీ క్వాలిఫైడ్ వారికి సత్వరము నియామక పత్రాలను ఇవ్వాలని కోరారు.

14. వైద్య కళాశాలలో పి.జి. విద్యనభ్యసించుచున్న వైద్య విద్యార్థులకు నెలకు ప్రభుత్వం చెల్లించుచున్న స్థిఫండ్ ను ఇటీవల కాలంలో రు.50,000/- నుండి రు.70,000/- లకు పెంచారని, కానీ అది పి.జి. పూర్తి చేసి, ప్రభుత్వ వైద్య ఆసుపత్రులలో వైద్యులుగా పనిచేయు వారికి నెలకు కేవలం రు.53,000/-లు కన్సాలిడేటెడ్ వేతనం చెల్లిస్తున్నారని, కావున PG పూర్తి చేసి, ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయుచున్న వైద్యులకు టైం స్కేల్ ఇవ్వాలని, లేదా దు.70,000/- లకు మించి వేతనం చెందాలని కోరారు.

పై డిమాండ్లు కు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి స్పందనకు ఎ.పి.ఎస్.జీ.ఓ సంఘ నాయకులు సతోషం వ్యక్తం చేసారు.ఎ.పి.ఎస్.జీ.ఓ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏ.పి.జె.ఏ.సి చైర్మన్ శ్రీ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి గారు ఉద్యోగ సమస్యలు అన్నిటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళగా వారు సానుకూలంగా స్పందించి ఉద్యోగస్తుల సమస్యలు అన్నింటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన బృందంలో ఎ.పి.ఎస్.టి.ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బండి శ్రీనివాసరావు, రాష్ట్ర సహా అధ్యక్షులు సి.హెచ్.పురుషోత్తం నాయుడు, రాష్ట్ర ఉపనా క్యులు డి.వి.రమణ, రాష్ట్ర పదార

కార్యదర్శి బి.కృపావరం, కడప జిల్లా అధ్యక్యలు 3. వి. శివారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి సి.హెచ్. శ్రీనివాస్ మరియు ఇతర

ఎ.పి.ఎస్.టి.ఓ.ఎస్ రాష్ట్ర కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు .


(బండి శ్రీనివాసరావు)

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top