జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో నమూనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) నిర్ణయించింది. ఈ మేరకు డీఈవో తాహేరా సుల్తానా ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6 నుంచి 12 వరకు మొదటి విడత, 21 నుంచి 27 వరకు రెండో విడత నమూనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను రోజూ ఉదయం 9 గంటలకు వెబ్‌సైట్లో ఉంచుతారు. ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు వాట్సాప్‌లోనూ పంపుతారు. పరీక్షకు గంట ముందు ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపునకు పంపాలి. ఈ విషయంలో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల సహకారంతో ప్రశ్నపత్రాలు తప్పనిసరిగా విద్యార్థులకు అందజేయాలి. విద్యార్థుల హాజరును సబ్జెక్టు ఉపాధ్యాయుల ద్వారా ప్రధానోపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రతిరోజు డీఈవో సమీక్ష చేస్తారు.
సమయసారిణి ఇలా:
మొదటి, రెండో విడతల్లో ఈ నెల 6, 21న తెలుగు, 7, 22న హిందీ, 8, 23న ఇంగ్లిషు, 9, 24న లెక్కలు, 10, 25న భౌతికశాస్త్రం, 11, 26న జీవశాస్త్రం, 12, 27న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలని పేర్కొంటూ సమయసారిణినివిడుదల చేశారు. ప్రశ్నపత్రాలు dcebkrishna.blogspot.com వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తారు.
విద్యార్థుల్ని ప్రోత్సహించాలి
సెలవుల్లో చదివే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు పంపాలి. ముందుగా సమయసారణిని పంపి విద్యార్థులను సిద్ధం చేయాలి. ఇందుకు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు సహకరించాలి.
- పుప్పాల లలితమోహన్, డీసీఈబీ కార్యదర్శి
Click Here to Download Question Papers
0 comments:
Post a Comment