దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు తీపికబురు అందబోతోందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎస్‌బీఐకి చెందిన ఇంటీగ్రేడెట్ డిజిటల్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ఎస్‌బీఐ యోనో యాప్‌లో కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ తన యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా టూవీలర్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ రుణలు అందించేందుకు రెడీ అవుతోంది. బ్యాంక్ రూ.2.5 లక్షల వరకు టూవీలర్ రుణాలు అందిస్తోంది. అలాగే ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్స్ కింద రూ.20 లక్షల వరకు ఆఫర్ చేస్తోంది. అంటే యోనో యాప్‌లో కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే.. కస్టమర్లు యాప్ నుంచే రూ.10 లక్షల వరకు లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.ప్రస్తుతం ఎస్‌బీఐ యోనో రూ.2.5 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే క్షణాల్లో లోన్ పొందొచ్చు. ఎస్‌బీఐ తన పాత కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు కూడా రుణాలు అందించనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త సర్వీసుల ద్వారా క్రెడిట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకోవాలని ఎస్‌బీఐ భావిస్తోంది. అందుకే కొత్త సేవలు తీసుకురాబోతోంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment