నిమిషాల్లోనే RT PCR ఫలితం - నూతన ఆవిష్కరణ

 కొవిడ్‌-19 నిర్ధారణకు ఉద్దేశించిన ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో వేగాన్ని పెంచే కొత్త సాధనాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం ఫలితాన్ని తెలుసుకోవడం కోసం బాధితులు 1-2 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌టీ ప్రక్రియ పూర్తయ్యాక, పీసీఆర్‌ను వేగంగా పూర్తి చేసేందుకు కి-హున్‌ జియోంగ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ప్లాస్మోఫ్లూయిడిక్‌ చిప్‌ను తయారుచేశారు. ఇది పోస్టల్‌ స్టాంపు పరిమాణంలో ఉంది. పాలీ డైమిథైల్‌ సైలోక్సేన్‌తో తయారైన ఈ చిప్‌లో పీసీఆర్‌ రియాక్షన్ల కోసం సూక్ష్మ చాంబర్లు ఉంటాయి. ఈ చిప్‌పై ఒక చుక్క మేర నమూనాను వేసినప్పుడు.. వాక్యూమ్‌ ఆ ద్రవాన్ని సూక్ష్మ చాంబర్లలోకి లాగేస్తుంది.ఈ క్రమంలో ఏమైనా సూక్ష్మ బుడగలు ఉత్పన్నమైతే వాటిని తొలగించే వ్యవస్థ కూడా ఇందులో ఉంటుంది. ఆ తర్వాత చిప్‌ కింద ఉన్న తెల్లటి ఎల్‌ఈడీ దీపాన్ని ఆన్‌ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఆ సాధనంలోని బంగారు నానో ఐలాండ్‌లు, గాజు నానోపిల్లర్లు వేగంగా ఆ కాంతిని ఉష్ణంగా మార్చేస్తాయి. దీపాన్ని ఆఫ్‌ చేసినప్పుడు అంతే వేగంతో అవి చల్లబరుస్తాయి.

కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 జన్యువుతో కూడిన డీఎన్‌ఏను ఈ సాధనంతో పరీక్షించినప్పుడు 40 వేడెక్కించే-చల్లబరిచే సైకిళ్లు, ఫోరోసెన్స్‌ ద్వారా వైరస్‌ నిర్ధారణ ప్రక్రియ ఐదు నిమిషాల్లోనే పూర్తయింది. అనుమానితుడి నుంచి సేకరించిన నమూనాను అందులోకి లోడ్‌ చేయడానికి మరో 3 నిమిషాలు పట్టింది. ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చే ఆర్‌టీ ప్రక్రియను కూడా జోడిస్తే 10-13 నిమిషాల్లో పరీక్ష పూర్తవుతుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top