Reliance Jio తన పోర్ట్ ఫోలియోలో కొత్త ప్లాన్ ను యాడ్ చేసింది. ఇటీవలే, అతి తక్కువ ధరలో డబుల్ బెనిఫిట్స్ తో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో, ఇప్పుడు మరొక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను జత చేసింది. అన్లిమిటెడ్ లాభాలను తీసుకువచ్చే కొత్త రూ. 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ డేటా లిమిట్ తో వస్తుంది.
Jio రూ. 98 ప్లాన్ ప్రయోజనాలు
ఈ Jio రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అలాగే, రోజుకు 1.5 GB హై స్పీడ్ 4G డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.అయితే, ఈ Jio రూ. 98 ప్లాన్ తో ఎటువంటి ఉచిత SMS సర్వీస్ ను ఇవ్వడం లేదు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 14 రోజులకు గాను మొత్తంగా 21GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు
0 comments:
Post a Comment