కాంప్లెక్స్ HM లకు ఒక మొబైల్ యాప్ ఇవ్వబడుతుంది. వారి లాగిన్ లో వారికి అందే స్టాక్ వివరములు నమోదు చేయాలి

JVK-2,  2021-22 కాంప్లెక్స్ HM లు మరియు మండల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలు

1.గతంలో మాదిరి కాకుండా ఈ సంవత్సరం JVK సామగ్రి నందు బూట్లు, బ్యాగ్ లు, నోటు పుస్తకములు వంటివి స్కూల్ కాంప్లెక్స్ నకు ఈ నెల 3 వ తేదీ నుండి సరఫరా చేయ బడును.యూనిఫాం క్లాత్ మాత్రము MRC కు సరఫరా చేయబడును.

2.సంభందిత కాంప్లెక్స్ HM లు వీటిని కనీసం రెండు నెలలకు పైగా  భద్ర పరచుటకు గాను కాంప్లెక్స్ నందు సరియైన గదిని ఎంపిక చేసుకోవాలి.వర్షపు నీటి నుంచి, ఎలుకల వంటి వాటి నుంచి దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు తగు చర్యలు తీసుకొన వలెను. సరియైన గదిని ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆ గదిలో సామగ్రి ని బూట్లు ఒక వైపు size వారీగా, note books ఒక వైపు తరగతి వారీగా, బ్యాగ్స్ సైజ్ వారీగా .. ఇలా అన్నింటిని ఒకదానితో ఒకటి కలవకుండా జాగ్రత్తగా సర్దుకోవాలి.

3. సామగ్రి మొత్తము బాక్స్ ల యందు ప్యాక్ చేసి అందించుట జరుగుతుంది. వీటిని తెరచి invoice ప్రకారం స్టాక్ వచ్చింది అని, మరియు సరియైన size ల ప్రకారం, సరియైన క్వాలిటీ తో వచ్చింది అని ధృవీకరించు కొన్న పిదప మాత్రమే acknowledge ఇవ్వాలి. ఈ విషయంలో ఎలాంటి తేడా వచ్చినా సదరు కాంప్లెక్స్ HM బాధ్యత వహించాల్సి ఉంటుంది.

4.స్టాక్ సరి చూసుకొనిన వెంటనే  ప్రత్యేకమైన స్టాక్ రిజిష్టర్ నందు వివరములు నమోదు చేయాలి. JVK కొరకు ప్రత్యేకంగా స్టాక్ మరియు issue రిజిష్టర్ లను maintain చేయాలి

5. ఏ స్టాక్ ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది అనే వివరములు MEO ల mail ద్వారా కాంప్లెక్స్ HM లకు తెలియజేయ బడుతుంది.

6.invoice పత్రములను జాగ్రత్తగా భద్ర పరచవలసి యుంటుంది.

7.కాంప్లెక్స్ HM లకు ఒక మొబైల్ యాప్ ఇవ్వబడుతుంది. వారి లాగిన్ లో వారికి అందే స్టాక్ వివరములు, సప్లయర్ వివరములు మొదలగునవి ఉంటాయి. అందిన స్టాక్ ను సరి చూసుకున్న పిదప యాప్ లో నమోదు చేయాలి.

8.పై అధికారులు ఎప్పుడు అడిగినా JVK స్టాక్ వివరములు సమర్పించుటకు సిద్దంగా ఉంచుకోవాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top