యాంటీబాడీల నిర్ధరణకు హోమ్ కిట్ ను రూపొందించిన DRDO

🔷మానవ శరీరంలోని యాంటీబాడీల నిర్ధరణ కోసం భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్​డీఓ) ఓ కిట్​ను అభివృద్ధి చేసింది. కరోనా యాంటీబాడీ డిటెక్షన్ 'డిప్కోవాన్' పేరుతో రూపొందించిన దీనిని.. డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డిపాస్), డీఆర్‌డీఓలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ కిట్​తో కేవలం 75 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు

🔷శరీరంలోని యాంటీబాడీలను నిర్ధరణ చేసుకునేందుకు ఉపకరించే కిట్​ను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్​డీఓ) రూపొందించింది. కరోనా యాంటీబాడీ డిటెక్షన్ 'డిప్కోవాన్'గా పిలిచే ఈ కిట్.. 97శాతం కచ్చితత్వంతో, 99శాతం కరోనా వైరస్​ ప్రోటీన్లను గుర్తించగలదని డీఆర్​డీఓ పేర్కొంది.

🔷ఈ కిట్ జీవితకాలం 18 నెలలని , కేవలం 75నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది డీఆర్​డీఓ.

🔷దిల్లీకి చెందిన వాన్‌గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ కిట్​ ఉత్పత్తిని జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఒక్కో కిట్ ధర సుమారు రూ.75 ఉండొచ్చని అంచనా.

🔷అనుమతులు..

తాము రూపొందించిన కిట్ తయారీ, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్​సీఓ), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చినట్లు డీఆర్​డీఓ తెలిపింది. అలాగే.. ఏప్రిల్​లోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం లభించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది డీఆర్​డీఓ.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top