మీరు ఉన్న ప్రాంతం నుంచే మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్‌ల వివరాలు తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగా, మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, సులభంగా వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌కు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచే 18 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయ పౌరునికి టీకా అందిస్తామని మోడీ ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఏప్రిల్ 28 నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ నమోదుకు మీ ఇంటికి దగ్గర్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల వివరాలు ఈజీగా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
దీనికి మొదటగా మీరు మీ వాట్సాప్ మొబైల్ ద్వారా 'NAMASTE' అని టైప్ చేసి 9013151515 నంబర్‌కు పంపించాలి. చాట్‌బట్ మీకు ఆటోమెటిక్‌గా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల లొకేషన్‌ను చూపిస్తుంది. అప్పుడు మీకు అందుబాటులో ఉన్న టీకా సెంటర్‌ను ఎంచుకోవచ్చు.
-దాని తర్వాత మీరు, మీరు ఉంటున్న ఆరు అంకెల ఏరియా పిన్‌కోడ్‌ను టైప్ చేయాలి
- దీంట్లో సెంటర్ వివరాలతో పాటు, రిజిస్ట్రేషన్ నమోదుకు లింక్ కోవిన్ ద్వారా చేసుకోవాలి.వారికి మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందింనున్నారు. ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. హింది, ఇంగ్లిష్ రెండు భాషల్లో అందుబాటులో ఉంటుంది. డిఫాల్ట్ ఆప్షన్ ద్వారా హిందిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
కరోనాకు సంబంధించిన సందేహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ వాట్సాప్ చాట్‌బట్‌ను మార్చ్ 2020లో ప్రారంభించింది.
0 comments:
Post a Comment