*సీఎంకు నివేదిక సమర్పించిన ఆయుష్ కమిషన్
*పూర్తి నివేదిక వచ్చాక పంపిణీ చేయవచ్చు
కరోనా కట్టడి కోసం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య మందుపై నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చు. మూడు, నాలుగు రోజుల తర్వాత నివేదక వస్తుంది. సీసీఆర్‌ఏఎస్ నివేదక వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది’’ అని తెలిపారు.
‘‘ఆనందయ్య ఇప్పటికే 70-80 వేల మందికి మందు పంపిణీ చేశామని చెబుతున్నారు. వేల సంఖ్యలో మందు తీసుకుంటే ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదు’’ అని రాములు తెలిపారు.
0 comments:
Post a Comment