Coronavirus vaccination drives: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కోవిడ్ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే.. కరోనా వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి.. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రాణాళికలు రూపొందిస్తోంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా.. ప్రైవేటు కార్యాలయాల్లో నిర్వహించే టీకా డ్రైవ్‌లో వ్యాక్సిన్ వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కార్యాలయాల్లో ఏర్పాటు చేసే టీకా డ్రైవ్‌లో ఉద్యోగులందరితో పాటు వారిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులకు కూడా టీకాను వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
0 comments:
Post a Comment